Bigg Boss: ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
సోషల్ మీడియా ద్వారా తమ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను షేర్ చేసుకుంటారు హీరో, హీరోయిన్లు. అయితే ఇదే అదనుగా భావించి కొందరు నెటిజన్లు అసభ్యకర సందేశాలు పంపుతుంటారు. అలా తాజాగా ఓ బిగ్ బాస్ నటికి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.
బిగ్ బాస్ హిందీ ఫేమ్ పవిత్రా పునియా గత కొన్ని రోజులుగా తన వ్యక్తిగత జీవితంతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు నటుడు ఎజాజ్ ఖాన్‌తో ప్రేమలో పడిందీ అందాల తార. ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో జీవించడం ప్రారంభించారు. అయితే కొన్ని నెలల క్రితమే వీరు విడిపోయారు. మతం మారాలని పవిత్రను ఎజాజ్ ఒత్తిడి చేశాడని, అందుకు పూనియా ససేమిరా అందని వార్తలు వచ్చాయి. కానీ నేను మతం మారబోనని రిలేషన్ షిప్ ప్రారంభంలోనే ఎజాజ్ కు స్పష్టం చేశానని పవిత్ర వివరించింది. దీని తర్వాత, సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ఖురాన్ చదివి ఇస్లాంలోకి మారాలని పవిత్రకు సందేశాలు పంపారు. తాజాగా వీటిపై బిగ్ బాస్ బ్యూటీ స్పందించింది. తనను మతం మారాలన్న నెటిజన్లకు క్లాస్ పీకింది. పవిత్ర ఇటీవల ఒక ఆలయాన్ని సందర్శించి అందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. దీనిపై ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘పవిత్రా.. విగ్రహారాధన మానేయమని నీకు మా సలహా. మా అన్న ఎజాజ్‌ఖాన్‌ని మీరు పెళ్లి చేసుకోలేకపోయారని తెలిసి చాలా బాధపడ్డాను. మీరు మీ మతం మారకపోతే, ఆయన మిమ్మల్ని వివాహం చేసుకోలేరు. ఇది ఇస్లాం ధర్మం. కాబట్టి నేను ఇప్పుడు మిమ్మల్ని ఇస్లాం స్వీకరించమని ఆహ్వానిస్తున్నాను. బాలీవుడ్ సెలబ్రిటీలందరికీ ఇస్లాం సత్యం అని తెలుసు. అందుకే మీరు కూడా ఖురాన్ చదవడం ప్రారంభించమని నా సలహా. నేను మీకు అనువదించబడిన ఖురాన్ లింక్‌ను మీకు పంపాను. మా విశ్వాసం అల్లాపై ఉంది. అతను మానవాళికి మార్గనిర్దేశం చేసేందుకు అంతిమ ప్రవక్త ముహమ్మద్‌ను పంపాడు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మతం ఇస్లాం. ఒక్క అమెరికాలోనే ఏటా 25 వేల మంది ఇస్లాం మతంలోకి మారుతున్నారు. పాశ్చాత్య దేశాలలో మతం మారిన వారిలో 75 శాతం మంది మహిళలే’ అని రాసుకొచ్చాడు.
నెటిజన్ కామెంట్స్ పై పవిత్ర స్పందించింది. ‘మీరు నాకు నేర్పకండి. సనాతన ధర్మం అంటే ఏమిటో చక్కగా వివరించడానికి నాకు కూడా చాలా సమయం ఉంది’ అని బదులిచ్చింది. అలాగే ఎజాజ్ ఖాన్ తో బ్రేకప్ పై మరోసారి స్పందించింది. ‘నేను ఎప్పటికీ నా మతం మారనని ఎజాజ్‌కి చాలా కాలం క్రితమే చెప్పాను. మరొకరి మతం మార్చే హక్కు ఎవరికీ లేదు. తన మతంలో నిజాయితీ లేనివాడు ఇతరులతో ఎలా నిజాయితీగా ఉంటాడు? ‘పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. కానీ మతం మారాలని అడిగే హక్కు ఎవరికీ లేదు’ అని తెగేసి చెప్పింది పవిత్ర. ప్రస్తుతం ఈ బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
మా హీరోను పెళ్లి చేసుకోవాలంటే మతం మారాల్సిందే..
View this post on Instagram
పవిత్ర పునియా లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.