- Telugu News Photo Gallery Cinema photos Heroine Shruti Haasan talks about her marriage and Relationship status, Details here
Shruti Haasan: అయ్యో.. మాట మార్చేసిన శృతి.! పెళ్లి టాపిక్ లోనే మళ్లీ ట్రెండ్..
నెవర్ ఎండింగ్ టాపిక్‌తో మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చేశారు శ్రుతిహాసన్. నెవర్ ఎండింగ్ అనగానే.. విషయం ఏంటో మీకు అర్థమైపోయే ఉంటుందిగా..యస్.. పెళ్లి ప్రస్తావనేనండీ.. మ్యారేజ్ గురించి శ్రుతి మామీ ఈ సారి ఏం చెప్పేశారో చూద్దాం.లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు మనం అనుకున్నట్టు జరుగుతుంది.మరికొన్ని సార్లు అసలు మన ఊహకు అందను కూడా అందదు అంటూ తన లైఫ్‌ని విశ్లేషిస్తున్నారు హాసన్ భేటీ శ్రుతి.
Updated on: Dec 28, 2024 | 9:18 PM

నెవర్ ఎండింగ్ టాపిక్‌తో మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చేశారు శ్రుతిహాసన్. నెవర్ ఎండింగ్ అనగానే.. విషయం ఏంటో మీకు అర్థమైపోయే ఉంటుందిగా..

యస్.. పెళ్లి ప్రస్తావనేనండీ.. మ్యారేజ్ గురించి శ్రుతి మామీ ఈ సారి ఏం చెప్పేశారో చూద్దాం.

లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు మనం అనుకున్నట్టు జరుగుతుంది.

మరికొన్ని సార్లు అసలు మన ఊహకు అందను కూడా అందదు అంటూ తన లైఫ్‌ని విశ్లేషిస్తున్నారు హాసన్ భేటీ శ్రుతి.

ఇంతకీ పెళ్లి మాటేంటి? అని ప్రస్తావిస్తే.. పెళ్లి చేసుకోను అని అన్నానే గానీ, ఎప్పటికీ చేసుకోననేం చెప్పలేదే. నేను బేసిగ్గా రొమాంటిక్ పర్సన్‌ని.

రిలేషన్‌షిప్ లో ఉండటం ఇష్టం. నచ్చిన వారితో చనువుగా ఉంటా. ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన మాత్రం అసలు లేదు అని బిగ్ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు శ్రుతి.

ఫ్యూచర్ అంతా ఇతనితోనే ఉండి పోవాలనిపించినప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తానని అంటున్నారు శ్రుతి.

పెళ్లంటే తనకేం వ్యతిరేకత లేదన్నారు. తన సర్కిల్ లో ఎంతో మంది పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నారని చెబుతున్నారు ఈ బ్యూటీ.




