- Telugu News Photo Gallery Cinema photos Hero Suriya starts a new movie shooting is Suriya 45 with Director karthik Subbaraju and His Upcoming Movie Updates
Suriya: కంగువా పోయినా కల్ట్ తగ్గని సూర్య.! అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన టీం.
యాక్షన్ యాక్షన్ యాక్షన్.. యాక్షన్ తప్ప ఇంకేం ఆలోచించడం లేదు సూర్య. ఆయన ఫిల్మోగ్రఫీ మీద ఓ లుక్కేస్తే ఎవరికైనా ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. వెర్సటైల్ ఆర్టిస్ట్ గా పేరున్న సూర్య.. జస్ట్ మాస్.. నథింగ్ ఎల్స్ అనడానికి రీజన్ ఏంటి.? ప్యాన్ ఇండియా కాదు, వరల్డ్ వైడ్ దద్దరిల్లిపోయే సినిమా అంటూ కంగువను ప్రమోట్ చేశారు నడిప్పిన్ నాయగన్ సూర్య. ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఆ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ అలాంటిది. కానీ,
Updated on: Dec 28, 2024 | 9:27 PM

యాక్షన్ యాక్షన్ యాక్షన్.. యాక్షన్ తప్ప ఇంకేం ఆలోచించడం లేదు సూర్య. ఆయన ఫిల్మోగ్రఫీ మీద ఓ లుక్కేస్తే ఎవరికైనా ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది.

వెర్సటైల్ ఆర్టిస్ట్ గా పేరున్న సూర్య.. జస్ట్ మాస్.. నథింగ్ ఎల్స్ అనడానికి రీజన్ ఏంటి.? ప్యాన్ ఇండియా కాదు, వరల్డ్ వైడ్ దద్దరిల్లిపోయే సినిమా అంటూ కంగువను ప్రమోట్ చేశారు నడిప్పిన్ నాయగన్ సూర్య.

ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఆ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ అలాంటిది. కానీ, తీరా విడుదలయ్యాక జనాలను అట్రాక్ట్ చేయలేకపోయింది. అయినా డీలా పడిపోలేదు సూర్య.

బౌన్స్ బ్యాక్ అయ్యారు. కంగువ షేడ్స్ చెరిపేయడానికి ఫిక్సయ్యారు. కంగువ నచ్చకపోతేనేం.. ఇదిగో మీకోసం రెట్రో రెడీ అయిందంటూ ఫ్యాన్స్ కి ఖుషీ ఖబర్ తెచ్చేశారు సూర్య.

కార్తిక్ సుబ్బరాయన్ దర్శకత్వంలో తెరకెక్కింది రెట్రో. చాన్నాళ్ల తర్వాత పూజా హెగ్డేకి ప్రామినెంట్ రోల్ కనిపిస్తోంది ఈ మూవీలో. సూర్య గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తున్నారు.

కాశీ ఘాట్‌లో సూర్య, పూజ మధ్య సాగే సీన్ టీజర్‌లో ఆకట్టుకుంటోంది. రెట్రో పూర్తయిన వెంటనే ఆర్.జె.బాలాజీతో చేసే సినిమా కూడా యాక్షన్ ప్రధానంగానే ఉంటుంది.

ఆ తర్వాత వాడివాసల్ కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్. వీటన్నిటినీ కంప్లీట్ చేసుకుని, లోకేష్ కనగరాజ్‌తో రోలెక్స్ కేరక్టర్‌కి చేతులు కలుపుతారు సూర్య.

అది పక్కా ఊరమాస్ రోల్. సో, నియర్ ఫ్యూచర్‌లో పక్కా కమర్షియల్, యాక్షన్, ఊర మాస్ రోల్స్ లో మాత్రమే కనిపించాలని ఫిక్సయిపోయారు నడిప్పిన్ నాయగన్.




