- Telugu News Photo Gallery Cinema photos Guess This Actress In This Photo She Is Yakshini Web Series Heroine Vedhika Chilhood Pic
Tollywood: 20 ఏళ్లుగా క్రేజీ హీరోయిన్.. సెకండ్ ఇన్నింగ్స్లో గ్లామర్ సెన్సేషన్.. ఈ హీరోయిన్ ఎవరంటే..
తెలుగు చిత్రపరిశ్రమలో తొలిపరిచయంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదటి సినిమాలో అందం, అభినయంతో కట్టిపడేసింది. దీంతో వరుస సినిమాలతో అలరిస్తుందనుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఉన్నట్లుండి సినిమాలకు దూరమైంది. కానీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ఇంతకీ ఈ వయ్యారి ఎవరో తెలుసా.. ?
Updated on: Dec 28, 2024 | 6:47 PM

సౌత్ ఇండస్ట్రీలో ఆమెది దాదాపు 20 ఏళ్ల ప్రస్థానం. కానీ ఇప్పటికీ సరైన బ్రేక్ రాలేదు. తొలి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకుంది. కానీ కొన్నేళ్లు నటనకు గ్యాప్ తీసుకుంది. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి దూసుకుపోతుంది. ఆ హీరోయిన్ వేదిక.

ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో దూసుకుపోతుంది. ఇటీవల ఆమె నటించిన సోషియో ఫాంటసీ యక్షిణి అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను అలరించింది. అలాగే సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో రచ్చ చేస్తుంది.

అప్పుడెప్పుడో 20 ఏళ్ల క్రితం బాణం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది వేదిక. అందులో అమాయక సుబ్బలక్ష్మి పాత్రలో కట్టిపడేసింది. ఆ తర్వాత విజయదశమి, రాఘవ లారెన్స్ ముని, దగ్గరగా దూరంగా వంటి చిత్రాల్లో నటించింది.

తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలోనూ నటించి మెప్పించింది వేదిక. అక్కడే మంచే పేరు సంపాదించుకుంది. ఇక చాలా కాలం తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది.

ఇటీవల నాగార్జున నటించిన బంగర్రాజు సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన వేదిక.. అటు సినిమాలు, ఇటు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంటుంది. తాజాగా హారర్ వెబ్ సిరీస్ యక్షిణీలో మాయ పాత్రలో అందరినీ భయపెట్టింది.




