- Telugu News Photo Gallery Cinema photos Allu Arjun is in North Top Day 1 collections and Three south captains in top 5
Bollywood: నార్త్ టాప్ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు.. వారెవరు.?
ఈజీగా కుదిరే చోట ఏదో చేసేస్తే ఆనందం ఏముంటుంది? మనం చేరుకునే చోటు చూసి... అక్కడ మనవాడు ఒకడు ఉన్నాడ్రా అని అనిపించుకుంటే కదా అసలైన కిక్కు...నార్త్ లో డే ఒన్ ఓపెనింగ్‌లో ఫస్ట్ ప్లేస్‌లో మన హీరో ఉంటే, టాప్ 5లో మన కెప్టెన్లు ముగ్గురున్నారు.
Updated on: Dec 28, 2024 | 3:56 PM

బాలీవుడ్‌లో పేరు మోసిన ఖాన్‌ల రికార్డులను కొల్లగొట్టేస్తోంది సౌత్ కంటెంట్. నార్త్ హీరోల లెక్కలను దాటి ఫస్ట్ ప్లేస్‌ని కొట్టేశాడు పుష్పరాజ్. 72 కోట్ల ఓపెనింగ్ డే కలెక్షన్లు సాధించి... మొన్న మొన్నటి వరకు షారుఖ్ జవాన్ పేరు మీదున్న రికార్డులను దాటేశారు.

ఫస్ట్ ప్లేస్ పుష్ప ది రూల్ కొట్టేసేసరికి సెకండ్ ప్లేస్ తో సరిపెట్టుకుంటోంది బాద్షా జవాన్. అయితే జవాన్ సినిమాని డైరక్ట్ చేసింది సౌత్ డైరక్టర్ అట్లీ. నార్త్ లో ఆయన చేసిన ఫస్ట్ మూవీతోనే ఈ రేంజ్ రికార్డును సొంతం చేసుకున్నారు.

కంటెంట్ ఈజ్ కింగ్ అంటారు. ఏ మాత్రం ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన స్త్రీ2 ఇప్పుడు బాలీవుడ్ ఓవరాల్ కలెక్షన్లలో థర్డ్ ప్లేస్‌లో ఉంది. ఫస్ట్ పార్టుకు వచ్చిన క్రేజ్‌తో 55.4 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టేసింది స్త్రీ2

లాస్ట్ ఇయర్ షారుఖ్ నటించిన జవాన్ మాత్రమే కాదు.. పఠాన్ కూడా వెయ్యి కోట్ల క్లబ్బులో చేరింది. డే ఒన్ 55 కోట్ల వసూళ్లను రికార్డ్ చేసింది పఠాన్. ఇప్పుడు నాలుగో స్థానంలో ఉంది పఠాన్.

ఈ మూవీకి అతి దగ్గరకి వచ్చి ఆగింది రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా మన సందీప్‌రెడ్డి వంగా డైరక్ట్ చేసిన భారీ యాక్షన్ చిత్రం యానిమల్. 54.7కోట్లతో టాప్ ఫైవ్‌లో ఇప్పటికీ సేఫ్ ప్లేస్‌లో ఉంది యానిమల్.




