- Telugu News Photo Gallery Cinema photos Are those heroes going to make fans happy with two movies in 2025?
Tollywood Heroes: ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‌ని ఖుషి చేయనున్నారా.?
ఆల్రెడీ ఒకటి కంప్లీట్ అయింది. జోరు పెంచితే మాత్రం రెండోది కూడా రెడీ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇంతకీ రెడీ అయిన ఒకటేంటి.. జోరు చూపించాల్సిన ఆ రెండోది ఏంటి? అంటున్నారా. చిరంజీవి టు చరణ్... కెరీర్ల మీద ఫోకస్ పెంచితే అర్థమైపోతుంది.. ఇంకెందుకు ఆలస్యం డిస్కస్ చేసేసుకుందామా..
Updated on: Dec 28, 2024 | 3:11 PM

సంక్రాంతికి రావాల్సిన విశ్వంభరను, చెర్రీ గేమ్ చేంజర్ కోసం పోస్ట్ పోన్ చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. 2025కి ఆల్రెడీ ఓ సినిమా రిలీజ్ కన్‌ఫర్మ్. శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా అనౌన్స్ అయింది. అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ లైన్ లో ఉందన్నది టాక్. ఈ యంగ్ కెప్టెన్లు ఎవరు జోరు చూపించినా ఇంకో సినిమాను థియేటర్లకు తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అటు బాలయ్య కెరీర్‌లోనూ సేమ్ సీన్ కనిపిస్తోంది. సంక్రాంతికి డాకు మహరాజ్‌తో దూకుతున్నారు నందమూరి నటసింహం. ఆల్రెడీ అఖండ2 తాండవం ప్రీ ప్రొడక్షన్ పనులు గట్టిగా జరుగుతున్నాయి. బోయపాటి స్పీడు పెంచితే 2025 ఎండింగ్‌కి అఖండ తాండవాన్ని స్క్రీన్స్ మీద చూడొచ్చన్నది ఫ్యాన్స్ కోరిక.

పవన్ కల్యాణ్ నుంచి రెండు సినిమాలు వచ్చే ఏడాది పక్కా అన్నది ఎప్పటి నుంచో ఉన్న మాటే. ఆల్రెడీ హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి కావచ్చింది. అటు ఓజీకి కూడా ఇంకొన్నాళ్ల పాటు కాల్షీట్ ఇస్తే కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇయర్ పవర్ సైన్యం డబుల్ కా మీఠా కోసం రెడీగా ఉంటారు.

చరణ్ కూడా గేమ్‌చేంజర్‌తో సంక్రాంతికి పలకరించడానికి రెడీ. ఆల్రెడీ బుచ్చిబాబు సానా ప్రాజెక్ట్ షూటింగ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్‌కి రిలీజ్ ప్లాన్ చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

వీళ్లతో పాటు రేసులో నాని పేరు కూడా వినిపిస్తోంది. శ్రీకాంత్ ఓదెల సినిమా, హిట్3తో జనాలను పలకరించడానికి నేచురల్ స్టార్ కూడా సిద్ధంగానే ఉంటారన్నది టాక్. అన్ని ఓకే అయితే ఈ రెండు సినిమాలు 2025లో వచ్చేస్తాయి.




