- Telugu News Photo Gallery Cinema photos Priyanka mohan, malavika mohanan, saiee manjrekar trying to become star heroines status
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ మాత్రమే కాదు.. వాళ్ళ తర్వాత ఓ లేయర్ ఉంటుంది. హీరోలను ఎలాగైతే టైర్ 2 అంటామో.. హీరోయిన్స్ కూడా అంతే. సెకండ్ స్టేజ్‌లో ఉండే కొందరు హీరోయిన్స్ ఇప్పుడు టాప్ రేంజ్‌కు వెళ్లే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే టాప్ హీరోలతో జోడీ కడుతున్నారు. మరి స్టార్ స్టేటస్‌పై కన్నేసిన ఆ బ్యూటీస్ ఎవరు..?
Updated on: Dec 28, 2024 | 2:23 PM

శ్రీలీల, మీనాక్షి చౌదరి లాంటి హీరోయిన్స్ అంతా ఇప్పుడు టాప్ రేంజ్‌లో ఉన్నారు. వాళ్ళ తర్వాత ప్లేస్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళలో అందరికంటే ముందున్నారు ప్రియాంక మోహన్.

ఈ మధ్యే సరిపోదా శనివారంతో హిట్ కొట్టిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజిలో నటిస్తున్నారు. ఇది హిట్టైతే అమ్మడి రేంజ్ మారిపోయినట్లే. ప్రియాంక మోహన్ తర్వాత మాళవిక మోహనన్ సైతం ఇదే ప్లానింగ్‌లో ఉన్నారు.

ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రాజా సాబ్‌లో ఈమె హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే మాళవికకు అవకాశాలు వస్తున్నాయి.

ఇక ఇదే సినిమాలో నిధి అగర్వాల్ మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లులోనూ ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు నిధి. సాయి మంజ్రేకర్ సైతం తెలుగులో స్టార్ ఇమేజ్ కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు.

ప్రస్తుతం సాయి మంజ్రేకర్ ఈమె నిఖిల్ హీరోగా నటిస్తున్న ది ఇండియా హౌజ్‌తో పాటు.. కళ్యాణ్ రామ్ సినిమాలోనూ నటిస్తున్నారు. మేజర్‌తో వచ్చిన గుర్తింపు.. స్కంద, గనితో పోయింది ఈ భామకు. అందుకే పునర్వైభవం కోసం పాకులాడుతున్నారు.




