Unstoppable With NBK: ఆహా అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్.. బాలయ్యతో బాబీ, నాగవంశీ, తమన్ సరదా ముచ్చట్లు

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే. ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సెలబ్రిటీ టాక్‌ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు నాలుగో సీజన్ కూడా విజయవంతంగా రన్ అవుతోంది.

Unstoppable With NBK: ఆహా అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్.. బాలయ్యతో బాబీ, నాగవంశీ, తమన్ సరదా ముచ్చట్లు
Unstoppable With NBK
Follow us
Basha Shek

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 29, 2024 | 9:59 PM

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోన్న టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ టాక్ షోలో సందడి చేశారు. తమ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం అన్ స్టాపబుల్ నాలుగో సీజన్ రన్ అవుతోంది. ఈ సీజన్ లో ఇప్పటికే ఏడు ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. మొదటి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, రెండో ఎపిసోడ్‌కు మలయాళ స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్‌, మూడో ఎపిసోడ్‌కు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య‌, నాలుగు, ఐదు ఎపిసోడ్ కు అల్లు అర్జున్, ఆరో ఎపిసోడ్ లో నవీన్ పొలిశెట్టి, శ్రీలీల సందడి చేశారు. ఇక ఇటీవలే స్ట్రీమింగ్ కు వచ్చిన ఏడో ఎపిసోడ్ లో విక్టరీ వెంకటేష్, దగ్గుబాటి సురేశ్ బాబు, అనిల్ రావిపూడి, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ఇలా సంక్రాంతికి వస్తున్నాం టీమ్ అంతా సందడి చేసింది. ఇక అన్ స్టాపబుల్ ఎనిమిదో ఎపిసోడ్ కు డాకు మహారాజ్ టీమ్ రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ బాబీ కొల్లి, నిర్మాత నాగవంశీ, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అతిథులుగా బాలయ్య టాక్ షోకు హాజరు కానున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

కాగా బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న చిత్రం డాకు మహారాజ్. బాబీ తెరకెక్కిస్తోన్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా కనిపించనున్నాడు. అలాగే ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందించనున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా జనవరి 4న అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
ఏథర్ ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్.. కొత్త ఏడాది నయా కలర్స్ లాంచ్..!
ఏథర్ ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్.. కొత్త ఏడాది నయా కలర్స్ లాంచ్..!
పనస గింజల అద్భుతాలు తెలిస్తే ఇక అస్సలు పడేయరు..శరీరంలో జరిగే ఇదే!
పనస గింజల అద్భుతాలు తెలిస్తే ఇక అస్సలు పడేయరు..శరీరంలో జరిగే ఇదే!
క్యాన్సర్‌ను జయించిన శివన్న.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన నటుడు
క్యాన్సర్‌ను జయించిన శివన్న.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన నటుడు
కేసీఆర్ ప్రజల్లోకి అప్పుడే వస్తారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
కేసీఆర్ ప్రజల్లోకి అప్పుడే వస్తారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..
రెండోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..
సైట్ పని చేయకపోయినా ట్రైన్ టిక్కెట్స్ బుకింగ్..!
సైట్ పని చేయకపోయినా ట్రైన్ టిక్కెట్స్ బుకింగ్..!
బ్యాంకు ఖాతాలో ఇంత నగదు డిపాజిట్‌ చేస్తున్నారా? జరిమానా పడొచ్చు!
బ్యాంకు ఖాతాలో ఇంత నగదు డిపాజిట్‌ చేస్తున్నారా? జరిమానా పడొచ్చు!
అలర్ట్.. ఈ సీజన్‌‌లో షుగర్ స్థాయి ఎందుకు పెరుగుతుందో తెలుసా?
అలర్ట్.. ఈ సీజన్‌‌లో షుగర్ స్థాయి ఎందుకు పెరుగుతుందో తెలుసా?
భారత రక్షణ వ్యవస్థకు కీలకంగా 2024.. నయా ఆయుధాల ప్రవేశం
భారత రక్షణ వ్యవస్థకు కీలకంగా 2024.. నయా ఆయుధాల ప్రవేశం