AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yash: ‘అలా చేసి మళ్లీ నా మనసును గాయపర్చొద్దు’.. అభిమానులకు రాకింగ్ స్టార్ యశ్ ప్రత్యేక విన్నపం

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు కన్నడ నటుడు యశ్. ఇప్పుడు ట్యాక్సిక్ తో మరోసారి మనల్ని పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు రాఖీ భాయ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా తన అభిమానులను ఉద్దేశించి ఒక పోస్ట్ పెట్టాడు యశ్.

Yash: 'అలా చేసి మళ్లీ నా మనసును గాయపర్చొద్దు'.. అభిమానులకు రాకింగ్ స్టార్ యశ్ ప్రత్యేక విన్నపం
Actor Yash
Basha Shek
|

Updated on: Dec 30, 2024 | 8:26 PM

Share

కేజీఎఫ్ ఫేమ్, రాకింగ్ స్టార్ యష్ ఇప్పుడు ‘టాక్సిక్’ సినిమాతో బిజి బిజీగా ఉంటున్నాడు. కాగా త్వరలోనే అతని పుట్టిన రోజు రానుంది. దీంతో అభిమానులు యష్ పుట్టిన రోజును గ్రాండ్ గా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గతేడాది జరిగిన విషాద సంఘటనలను దృష్టిలో ఉంచుకుని యష్ తన అభిమానులకు ఒక ప్రత్యేక సందేశం పంపాడు. తన పుట్టినరోజున ఎలాంటి ఆడంబరాలు, హంగామా వద్దని, సింపుల్ గా సెలబ్రేట్ చేసుకోవాలంటూ యష్ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులను కోరారు. నేను ప్రస్తుతం టాక్సిక్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాను. సినిమా పనుల వల్ల ఈ పుట్టిన రోజున నేను ఊర్లో ఉండడం లేదు. దయచేసి మీ అందరికీ ఒక విన్నపం. నా పుట్టిన రోజున ఫ్లెక్సీలు, బ్యానర్లు అంటూ ఎలాంటి హంగులు, ఆర్భాటాలు చేయవద్దు. మరోసారి నా మనసు గాయపడేలా ప్రవర్తించకండి. మీకు ఓ కుటుంబముంది. వారికీ మీ అవసరముంది. వీలైనంత త్వరగా మీ అందరినీ కలుస్తాను. నూతన సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను’ అని అభిమానులను కోరారు యశ్.

‘ప్రియమైన అభిమానులకు నమస్కారం. మీ ప్రేమాభిమానాలతో నాకు మరో సంవత్సరం ఎంతో విలువైనదిగా మారిపోయింది. కొత్త ఏడాదిలో కొత్త ఆశలతో చిరునవ్వుతో జీవిద్దాం, కొత్త కొత్త ప్రణాళికలతో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుదాం’ అంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు యశ్.

ఇవి కూడా చదవండి

రాకింగ్ స్టార్ ట్వీట్..

కాగా గతేడాది యష్ పుట్టిన రోజు వేడుకల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఫ్లెక్సీలు కడుతూ ముగ్గురు అభిమానులు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో యశ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. అందుకే ఇకపై ఇలాంటి ఘటనలు జరగకూడదనేది యశ్ ఆలోచన. అందుకే ఈ ఏడాది తన అభిమానులకు ఇలా విజ్ఞప్తి చేశాడు. యశ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పుట్టినరోజు సందర్భంగా ‘టాక్సిక్’ నటీనటుల నుంచి అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఫ్యామిలీతో హీరో యశ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.