ఇంట్లో పారిజాత మొక్కను పెంచుకోవడం మాత్రమే కాదు ఆ మొక్కకు పూజ చేయడం కూడా శుభప్రదం. అప్పు ఇచ్చిన డబ్బులు తిరిగి రాక ఇబ్బంది పడుతున్నా.. లేక అప్పు తీసుకుని ఆ డబ్బులు చెల్లించడంలో జాప్యం అవుతున్నా పారిజాతం మొక్కకు పూజ చేయడం ఫలితాన్ని ఇస్తుంది. పారిజాత మొక్క ముక్కను తీసుకుని ఎర్రటి గుడ్డలో కట్టి లక్ష్మీదేవి ముందు ఉంచాలి. దీని తరువాత లక్ష్మీ దేవిని, మొక్క ముక్కను పూజించాలి. పారిజాతం మొక్కకు పసుపు, కుంకుమని దిద్ది.. కనకధార స్తోత్రాన్ని పఠించండి.. ఈ నివారణ చర్యలు ఖచ్చితంగా ఆర్ధిక ప్రయోజనాలను చేకూరుస్తాయని వాస్తు శాస్త్రం పేర్కొంది.