Vastu Tips: ఇంట్లో వాస్తు దోషాలా డబ్బు ఖర్చు లేకుండా వాస్తుని ఇలా సరి చేయండి..ఈజీ పరిహారాలు ఏమిటంటే

వాస్తు శాస్త్రంలో ఇంటిని నిర్మించుకోవడానికి మాత్రమే కాదు ఇంట్లో పెట్టుకునే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి వస్తువును ఉంచడానికి కొన్ని వాస్తు నియమాలు కూడా పేర్కొనబడ్డాయి. వాస్తు నియమాలు పాటించకపోతే ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడతాయి. ఇలాంటి వాస్తు దోషాలను ఎలా పరిష్కరించాలి అని కొందరు ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో డబ్బు ఖర్చు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు పడకుండా చేసే కొన్ని వాస్తు పరిష్కారాల గురించి తెలుసుకుందాం..

Vastu Tips: ఇంట్లో వాస్తు దోషాలా డబ్బు ఖర్చు లేకుండా వాస్తుని ఇలా సరి చేయండి..ఈజీ పరిహారాలు ఏమిటంటే
Vastu Remedies
Follow us
Surya Kala

|

Updated on: Jan 01, 2025 | 12:46 PM

ప్రతి ఒక్కరి జీవితంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే కొంత మంది రకరకాల కారణాలతో ఇల్లు కట్టే సమయంలో వాస్తు నియమాలను పాటించరు. ఇలాంటి కారణంగా ఇంట్లో వాస్తు దోషాలు తలెత్తుతాయి. ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే పాజిటివ్ ఎనర్జీ స్థానంలో నెగెటివ్ ఎనర్జీ రావడం మొదలవుతుంది. వాస్తు దోషాల వల్ల వివిధ రకాల రోగాలు, దుఃఖాలు తలెత్తుతాయి. అటువంటి పరిస్థితిలో మీ ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంటి వాస్తు దోషాలను డబ్బు ఖర్చు లేకుండా .. ఎటువంటి కూల్చి వేతలు లేకుండా సరిదిద్దవచ్చు. డబ్బు ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నింటినీ తొలగించుకోవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం వీటిని పాటించడం ద్వారా డబ్బు ఖర్చు లేకుండా ఇంటిలోని వాస్తు దోషాలు తొలగిపోతాయి. నివారణ చర్యలు ఏమిటంటే..

కర్పూరం: వాస్తు దోషం ఉన్న ఇంటి భాగంలో కర్పూరం ముక్క ఉంచండి. కొన్ని కర్పూరం ముక్కలను నెయ్యిలో ముంచి మట్టి దీపంలో వెలిగించండి. ప్రతిరోజూ సాయంత్రం వంటగదిలో కర్పూరాన్ని వెలిగించడం కూడా మంచిదని భావిస్తారు. కర్పూరానికి సంబందించిన ఈ రెమెడీ పాటించడం వల్ల ఇంటిలోని వాస్తు దోషాలు తొలగిపోతాయి.

గుర్రపుడెక్క: ఇంటి ప్రధాన ద్వారంపై నల్లని గుర్రపుడెక్కను ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వచ్చి.. నెగెటివ్ ఎనర్జీ దూరమవుతుంది. అయితే ఈ గుర్రపుడెక్క ఆంగ్ల అక్షరం ‘U’ ఆకారంలో ఉండాలని గుర్తుంచుకోండి.

ఇవి కూడా చదవండి

కలశం: ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఇంట్లో ఈశాన్య మూలలో కలశం పెట్టాలి. ఈ కలశాన్ని ఈశాన్య మూలలో ఉంచడం వల్ల గణేశుడి అనుగ్రహం లభిస్తుంది.

సముద్ర ఉప్పు: ఇంట్లో ఏదో ఒక మూలలో సముద్రపు ఉప్పుతో నింపిన గాజు గిన్నె ఉంచండి. ఇంటిని తుడిచే సమయంలో నీటిలో కొద్దిగా ఉప్పు వేసి.. ఆ నీటితో ఇంటిని శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి సానుకూలత నెలకొంటుంది.

డబ్బు ఖర్చు చేయకుండా ఇంటిలోని వాస్తు దోషాలను ఎలా తొలగించాలంటే

  1. ఇంటి ప్రధాన ద్వారం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి. ఇంటిలో పగలు రాత్రి గాలి, తగినంత వెలుతురు ఉంచేలా ఏర్పాటు చేసుకోండి
  2. ప్రధాన ద్వారం వద్ద వినాయకుడి విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచండి
  3. ఇంటి ప్రధాన ద్వారంపై స్వస్తిక చిహ్నాన్ని ఉంచండి.
  4. ఇంట్లో ఈశాన్య మూలలో వెండి వస్తువుని ఉంచడం శుభప్రదం
  5. ఇంటి వాయువ్య మూలలో దీపం వెలిగించాలి.
  6. ఇంట్లోని అగ్ని మూల అంటే ఆగ్నేయ దిశలో ఎప్పుడూ ఎర్రటి బల్బు వెలిగేలా చూసుకోండి
  7. ఇంటి ఆగ్నేయ మూలలో గణేశుడి బొమ్మ లేదా విగ్రహాన్ని ఉంచండి. అంతేకాదు ఈ దిక్కులో మనీ ప్లాంట్‌ మొక్కను పెంచుకోండి
  8. నీటితో నింపిన రాగి పాత్రలో నీరు పోసి పువ్వు వేసి ఇంటి ఈశాన్య మూలలో ఉంచాలి.
  9. ఇంటి ఈశాన్య మూలలో చెత్తను లేదా ఏదైనా భారీ వస్తువులను పొరపాటున కూడా పెట్టవద్దు.
  10. ఇంటి ప్రధాన ద్వారం వద్ద సూర్య భగవానుడి యంత్రాన్ని అమర్చడం శుభప్రదం.
  11. సాయంత్రం ఇంటికి నైరుతి మూలలో దీపం వెలిగించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.