Skanda Sashti 2025: సంతానం లేదా.. కష్టాలా స్కంద షష్ఠి రోజున ఈ పద్ధతితో కార్తికేయుడిని పూజించండి.. ప్రతి కోరిక నెరవేరుతుంది
శివ పార్వతుల ముద్దుల తనయుడు కార్తికేయుడు.. ఈయననే సుబ్రహ్మణ్యస్వామి, కుమారస్వామి, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహూడు అంటూ వివిధ పేర్లతో పిలుస్తారు. అంతేకాదు కార్తికేయుడి జన్మ దిననాన్ని స్కంద షష్ఠి పండుగగా జరుపుకుంటారు. ప్రతి నెల శుక్ల పక్ష షష్ఠి తిథిని స్కంద షష్ఠి జరుపుకుంటారు. ఈ రోజున కార్తికేయుడిని పూజించడం వల్ల కష్టాలు తీరతాయని.. జీవితంలో విజయం చేకూరుతుందని నమ్మకం.
హిందూ మతంలో స్కంద షష్టి పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున కార్తికేయుడిని పూజించడం ద్వారా ప్రజల కోరికలన్నీ నెరవేరుతాయి. జీవితంలో ఏర్పడే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు నెలకొంటాయి. ఈ రోజున కార్తికేయుడిని పూజించడం వల్ల అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి. స్కంద షష్ఠి రోజున కార్తికేయుడిని ఎలా పూజించాలో తెలుసుకుందాం.
పంచాంగం ప్రకారం మార్గశిర మాసంలోని శుక్ల పక్ష షష్ఠి తిథి జనవరి 04న రాత్రి 10 గంటలకు ప్రారంభమై మర్నాడు అంటే జనవరి 05 రాత్రి 08:15 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం స్కంద షష్ఠి జనవరి 05వ తేదీ 2025 న జరుపుకుంటారు. భక్తులు కార్తికేయుడిని పూజించే స్కంద షష్ఠి కొత్త సంవత్సరంలో ఇదే మొదటి స్కంద షష్టి.
కార్తికేయుడిని ఎలా పూజించాలంటే
- తెల్లవారు జామున నిద్ర లేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి.
- శుభ్రమైన స్థలాన్ని ఎంచుకుని ఆ ప్రదేశాన్ని పూలతో దీపాలతో అలంకరించండి.
- శుభ్రమైన పీఠంపై కార్తికేయ విగ్రహాన్ని లేదా చిత్ర పటాన్ని ప్రతిష్టించండి.
- పూజకు అవసరమైన నీరు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, చందనం, అక్షతం, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం మొదలైన వాటిని సేకరించండి.
- కార్తికేయ స్వామి ముందు నెయ్యి దీపం వెలిగించండి.
- గంగాజలం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారతో కార్తికేయుడిని అభిషేకించండి.
- దేవుడికి చందనం, అక్షతలు సమర్పించండి.
- దేవుడికి పూలు సమర్పించడం, తామరపువ్వులను సమర్పించడం విశేషంగా భావిస్తారు.
- దేవుడికి పండ్లు, స్వీట్లతో పాటు ఆహార పదార్దాలను నైవేద్యంగా సమర్పించండి.
- కార్తికేయుడిని పూజిస్తూ.. మంత్రాలను జపించండి.. ఓం షడాననాయ నమః, ఓం స్కంద దేవాయ నమః, ఓం శరవణభవాయ నమః, ఓం కుమారాయ నమః.
- సుబ్రహ్మణ్య స్వామికి హారతి ఇవ్వండి. స్కంద షష్ఠి శీఘ్ర కథను పఠించండి.
- పూజ సమయంలో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. సుబ్రహ్మణ్యస్వామిని భక్తితో స్మరించుకుంటూ ఉండండి.
- పూజ సమయంలో ఎలాంటి వివాదాలు, గొడవలు పెట్టుకోవద్దు. ఉపవాస సమయంలో మాంసాహారం, మద్యం సేవించవద్దు
స్కంద షష్ఠి ప్రాముఖ్యత
స్కంద షష్ఠి అనేది హిందూ మతం ముఖ్యమైన పండుగ. ఈ రోజు కార్తికేయకు అంకితం చేయబడింది. ఈ పండుగను సాధారణంగా కార్తీక మాసంలోని శుక్ల పక్షం షష్టి తిథి రోజున జరుపుకుంటారు. ఈ రోజున కార్తికేయుడిని పూజించిన భక్తులకు ధైర్యం, తెలివి, విజయం సొంతం అవుతుంది. ఈ రోజున కార్తికేయుడిని పూజించడం వల్ల దుష్టశక్తులు నశిస్తాయని నమ్మకం ఉంది. కార్తికేయుని అనుగ్రహం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి. సంతానం కోసం ఈ రోజున ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం వలన అనుగ్రహం కోరిక తీరుతుందని నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.