AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu and kashmir: మంచు దుప్పటి కప్పుకున్న కశ్మీరం.. భూతల స్వర్గంలో ఎంజాయ్ చేస్తోన్న పర్యాటకులు.. రైలు సర్వీసులు నిలిపివేత

జమ్మూకశ్మీర్‌లో మంచు అందాలు మైమరిపిస్తున్నాయి. మూడు నాలుగు రోజులుగా భారీగా కురుస్తున్న మంచుతో ఆ ప్రాంతం ధవళ వర్ణంతో భూతల స్వర్గంలా మారింది. అయితే తీవ్రంగా కురుస్తున్న మంచుతో    రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రధానంగా.. రైల్వే ట్రాక్‌లపై మంచు భారీగా పేరుకుపోవడంతో అధికార యంత్రాంగంతం తొలగింపు చర్యలు ముమ్మరం చేసింది.

Jammu and kashmir: మంచు దుప్పటి కప్పుకున్న కశ్మీరం.. భూతల స్వర్గంలో ఎంజాయ్ చేస్తోన్న పర్యాటకులు.. రైలు సర్వీసులు నిలిపివేత
Jammu Kashmir Snow Fall
Surya Kala
|

Updated on: Jan 01, 2025 | 7:46 AM

Share

జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాలు మంచుమయం అయ్యాయి. ఎటువైపు చూసినా కనుచూపు మేరలో హిమపాతం దర్శనమిస్తోంది. మంచు దుప్పటి కప్పుకున్న కాశ్మీర్ అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఎక్కడ చూసినా పర్యాటకుల సందడే కనిపిస్తోంది. అదే సమయంలో భారీ మంచు వర్షంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ముఖ్యంగా.. రైల్వే ట్రాకులపై భారీగా మంచు పేరుకుపోవడంతో పలు ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ దెబ్బతింది.  దీంతో.. స్నో కట్టర్ అమర్చిన లోకోమోటివ్ ద్వారా ట్రాక్ క్లియరెన్స్ పనులు కొనసాగిస్తున్నారు రైల్వే అధికారులు. ట్రాకులపై పేరుకుపోయిన మంచును తొలగించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

మంచు కారణంగా పలు ప్రాంతాల్లో రైలు సర్వీసులను నిలిపివేశారు. ఈ క్రమంలోనే.. శ్రీనగర్‌ రైల్వే స్టేషన్‌లో మంచు పెద్దయెత్తున కురుస్తుండడంతో రైల్వే ట్రాకులు మంచుతో నిండిపోయాయి. దాంతో.. అలెర్ట్‌ అయిన ఇండియన్‌ రైల్వే టీమ్‌.. స్నో కట్టర్లతో రంగంలోకి దిగింది. రైలు ఇంజిన్లకు స్నో కట్టర్‌లను అమర్చి ట్రాకులపై నిలిచిన మంచును తీసివేస్తున్నారు. కంటిన్యూ హిమపాతం ఉన్నప్పటికీ.. రైల్వే కనెక్టివిటీకి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. శ్రీనగర్‌ రైల్వే స్టేషన్‌లో లోకోమోటివ్‌ స్నోకట్టర్‌లతో మంచు తొలగిస్తున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

మరోవైపు.. ఎప్పటికప్పుడు మంచు తొలగిస్తుండడంతో జమ్మూ-శ్రీనగర్ హైవేపై వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇక.. మరో రెండు రోజులపాటు మంచు భారీగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొండ ప్రాంతాలు, మైదాన ప్రాంతాల్లో దట్టమైన మంచు కురుస్తుందని వెల్లడించింది. ఎల్లుండి నుంచి జనవరి 6 మధ్యలో కశ్మీర్ డివిజన్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ హిమపాతం కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇదిలావుంటే.. న్యూ ఇయర్‌ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌లో మంచు అందాల మధ్య పర్యాటకులు ఎంజాయ్‌ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్