Maha Kumbha Mela: కుంభ మేళా ఏర్పాట్లు పరిశీలించిన సీఎం.. హనుమాన్ మందిర్‌లో ప్రత్యేక పూజలు
ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు కౌంట్‌డౌన్ ప్రారంభమయ్యింది. మరో 12 రోజుల్లో కుంభమేళా మొదలవుతుంది. ఈ సారి కుంభ మేళా ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల సౌకర్యార్ధం చేస్తోన్న ఏర్పాట్లను సీఎం యోగి పరిశీలించారు. ప్రయాగ్‌రాజ్ పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు.. త్రివేణి సంగమం దగ్గర ప్రత్యేక పూజలను నిర్వహించారు.
పవిత్ర త్రివేణీ సంగమ క్షేత్రం ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కుంభమేళా ఏర్పాట్లను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ పరిశీలించారు. కుంభమేళా ఘాట్లను యోగి పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రయాగ్‌రాజ్ హనుమాన్ మందిర్‌లో ప్రత్యేక పూజలు చేశారు యోగి.. సంగం నోజ్ ఘాట్ దగ్గర త్రివేణి సంగమం దగ్గర హారతి ఇచ్చారు.
జనవరి 13వ తేదీ నుంచి ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా
ప్రయాగ్‌రాజ్‌లో బయో సీఎన్‌జీ ప్లాంట్‌ను యోగి ప్రారంభించారు. ఏర్పాట్లపై అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గత 25 రోజుల్లో యోగి ప్రయాగ్‌రాజ్‌కు రావడం ఇది ఐదోసారి.. 6 లేన్ల బ్రిడ్జ్‌ను ప్రారంభించారు. కుంభమేళా వేదిక డ్రోన్ దృశ్యాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. . జనవరి 13వ తేదీ నుంచి ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా ప్రారంభమవుతోంది. దేశ విదేశాల నుంచి 40 కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించే అవకాశం ఉంది. ఫిభ్రవరి 26వ తేదీ వరకూ ప్రయాగర్‌రాజ్ కుంభమేళా కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు నాగసాధువులు ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు
కుంభమేళా నిర్వహణ కోసం రూ.7500 కోట్లు
ప్రయాగ్‌రాజ్ కుంభమేళాను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కుంభమేళా నిర్వహణ కోసం రూ.7500 కోట్లు కేటాయించింది యూపీ సర్కార్. రైల్వే శాఖ 13 వేల రైళ్లను భక్తుల కోసం నడుపుతోంది. 50 వేల మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఏఐ టెక్నాలజీతో వార్‌రూమ్ ఏర్పాటు చేసి కుంభమేళా జరుగుతున్న ప్రాంతంపై డేగకన్నుపెట్టారు.
15 లక్షల మంది సాధువుల రాక
సాధువుల కోసం అధికారులు ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టెంట్‌సిటీని నిర్మించారు. దాదాపు 15 లక్షల మంది సాధువులు కుంభమేళాకు హాజరు కానున్నారని అంచనా. 13 అఖారాలకు చెందిన సాధువులు కుంభమేళాలో పాల్గొంటున్నారు. భక్తులు కుంభ మేళాలో ఆయా ప్రదేశాలకు వెళ్లేందుకు ఆంగ్లం, హిందీ, ప్రాంతీయ భాషల్లో 800 బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. 92 రోడ్లు పునర్నిర్మిస్తున్నారు. 17 ప్రధాన రహదారులను సుందరీకరించారు. అవాంఛనీయ ఘటనలు జరక్కుండా అత్యాధునిక బహుళ విపత్తు నివారణ వాహనాలను మోహరిస్తున్నారు. సౌర విద్యుత్ తో లైటింగ్ వసతులు కల్పిస్తున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించారు. మొత్తంగా ఈ మహా కుంభమేళాను ప్రపంచం దృష్టి ఆకర్షించేలా నిర్వహించేందుకు యోగి సర్కార్ అన్ని ఏర్పాట్లు ఎయిర్‌పోర్ట్ నుంచి నగరం లోని ఇతర ప్రాంతాల్లో 23 చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేశారు. దేశవిదేశాల నుంచి వచ్చే భక్తుల కోసం లక్షా 60 వేల టెంట్లను ఏర్పాటు చేశారు. లక్షన్నర తాత్కాలిక టాయ్‌లెట్లను నిర్మించారు. 4 వేల హెక్టార్లలో కుంభమేళాను నిర్వహిస్తున్నారు.
మహాకుంభమేళను స్వచ్ఛంగా, ఆరోగ్యంగా, సురక్షిత, డిజిటల్ కార్యక్రమంగా మార్చేందుకు యూపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈసారి మహాకుంభమేళాను గతంలో కంటే అద్భుతంగా నిర్వహిస్తామంటున్నారు అధికారులు. హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని తీరాలల్లో కుంభమేళ ఏర్పాట్ల సందడి మొదలైంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహా కుంభం ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభ స్నానం ప్రారంభమవుతుంది. కుంభమేళ సమయంలో నదీ స్నానం చేస్తే మోక్షం కలుగుగుతుందనేది భక్తులు విశ్వాసం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..