AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahu Ketu Gochar 2025: కొత్త ఏడాదిలో ఏకకాలంలో రాశిని మార్చుకోనున్న రాహు, కేతులు.. ఈ 3 రాశులకు అష్ట కష్టాలే.. బంగారం పట్టుకున్న బొగ్గే..

2025 సంవత్సరంలో రెండు ఛాయ(నీడ) గ్రహాలు తమ రాశిని మార్చుకోనున్నాయి. ఆ గ్రహాలు రాహువు, కేతువు. వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాహువు, కేతువు గ్రహాలను ఛాయా గ్రహాలు.. ఈ రెండు గ్రహాల సంచారం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తోంది. ఎందుకంటే ఈ రెండు గ్రహాల సంచారం 12 రాశుల వారి జీవితాన్ని ప్రభావితం అవుతుంది. 2025 సంవత్సరంలో ఈ రెండు గ్రహాల రాశులు మారిన తర్వాత కొన్ని రాశుల వారు తమ జీవితాల్లో సమస్యలను ఎదుర్కొంటారు. ఆ రాశులు ఏవోమిటో తెలుసుకుందాం.

Rahu Ketu Gochar 2025: కొత్త ఏడాదిలో ఏకకాలంలో రాశిని మార్చుకోనున్న రాహు, కేతులు.. ఈ 3 రాశులకు అష్ట కష్టాలే.. బంగారం పట్టుకున్న బొగ్గే..
Rahu Ketu Gochar 2025
Surya Kala
|

Updated on: Jan 01, 2025 | 8:26 AM

Share

నవ గ్రహాల్లో రాహువు, కేతువులు నీడ గ్రహాలు అని.. ఇవి భ్రమ కలిగించే గ్రహాలు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రెండు గ్రహాల కదలిక తిరోగమనం అంటే రివర్స్ లో ఉంటుంది. దీంతో రాహువు, కేతువులు 2025లో ఏక కాలంలో తమ రాశులను మార్చుకోనున్నాయి. ఈ సంవత్సరం అంటే 2025 మే 18న తమ రాశులను వదిలి తిరోగమనంలో పయనిస్తూ రాహువు మీనరాశిని వదిలి కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. అదే రోజున అదే సమయంలో కేతువు సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు.

రాహు కేతు సంచారం ఎప్పటి వరకూ అంటే

2025 మే 18న కుంభరాశిలో ప్రవేశించే రాహువు సంచారం ఈ రాశిలో డిసెంబర్ 5, 2026 వరకు ఉంటుంది. ఆ తర్వాత మకరరాశిలోకి వెళ్లనున్నాడు. కేతువు కూడా మే 18 న కన్యారాశి నుంచి బయటకు వచ్చి సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. నవ గ్రహాలకు అధిపతి సూర్యుడు సింహ రాశికి అధిపతిగా పరిగణించబడుతున్నాడు. అయితే సూర్యభగవానుడితో రాహు, కేతువుల సంబంధాలు ప్రతికూలంగా ఉంటాయి. కనుక ఈ రాశికి వారికీ కొన్ని కష్టాలు తప్పవని జ్యోతిష్కులు అంటున్నారు. కేతువు డిసెంబర్ 5, 2026 వరకు సింహరాశిలో సంచరించానున్నాడు. దీని తర్వాత కేతువు కర్కాటక రాశిలోకి ప్రవశించనున్నాడు. అయితే రాహు, కేతువుల రాశుల మార్పు వల్ల సింహ రాశితో పాటు కొన్ని రాశులవారికి ఎన్నో కష్టాలు రానున్నాయి. దీంతో ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.

మిధునరాశి: 2025 మే 18న రాహువు, కేతువుల రాశి మార్పు తర్వాత మిథునరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రాహువు, కేతువుల రాశి మార్పుతో ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడవచ్చు. వ్యాపారస్తులు తమ భాగస్వామి చేసే ద్రోహంతో తీవ్ర ఇబ్బందులు పడవచ్చు. ఉద్యోగస్తులు అనేక అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

సింహ రాశి: రాహువు, కేతువుల రాశి మారిన తర్వాత సింహ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మే 18న రాశి మారిన తర్వాత కేతువు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో సింహ రాశి వారు కొంత నష్టానికి గురవుతారు. ముఖ్యమైన పనులకు ఆటంకాలు ఏర్పడవచ్చు. ఆర్థిక సమస్యలు కూడా ఈ రాశి వారిని తీవ్ర ఇబ్బందులు కలుగజేయవచ్చు. ఈ సమయంలో వీరు కెరీర్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంది.

కుంభ రాశి: కుంభ రాశి వారికి రాహువు, కేతువుల రాశి మార్పు తర్వాత అంటే మే 18 తర్వాత దాదాపు 9 నెలలు అత్యంత కష్టాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రతి పని కష్టంగా, సవాలుగా ఉంటుంది. ఎందుకంటే మే 18న రాహువు మీన రాశిని వదిలి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో వ్యాపారస్తులకు వ్యాపార పరంగా ఈ సమయం అతి చెడ్డగా సాగుతుంది. వ్యాపారంలో ప్రణాళిక విఫలం కావచ్చు. ఈ సమయంలో ఆర్థికంగానే కాదు ఆరోగ్య పరంగా కూడా కష్టాలు ఎదుర్కొనాల్సి ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.