Pakistan vs Taliban: పాముకు పాలు పోస్తే ఇంతే మరి.. 19 మంది పాక్ సైనికులను చంపి.. 17 ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు

పాకిస్తాన్‌ -ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డ్యూరాండ్ లైన్‌ దగ్గర బాంబుల మోత మోగుతోంది. పాకిస్తాన్‌ వైమానిక దాడులు చేసి 40కిపైగా ఆఫ్ఘన్‌ పోస్టులను స్వాధీనం చేసుకోగా.. తాలిబన్లు 19 మంది పాకిస్తాన్‌ సైనికులను చంపేసి 17 ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్నారు

Pakistan vs Taliban: పాముకు పాలు పోస్తే ఇంతే మరి.. 19 మంది పాక్ సైనికులను చంపి.. 17 ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు
Pakistan Vs Taliban War
Follow us
Surya Kala

|

Updated on: Jan 01, 2025 | 9:49 AM

పాము విషం చిమ్ముతుంది.. అది దాని నేచర్ అని తెలిసి కూడా పెంచుకుంటే ఏమవుతుంది.. పెంచిన వారినే కాటేస్తుంది.. ఇదే విధంగా ఉంది ప్రస్తుతం మన దాయాది దేశం పాకిస్తాన్ పని. తాను పెంచి పోషించిన తాలిబన్లు తమపైనే కత్తులు దూస్తారని అసలు ఊచించి ఉండదు. ఆఫ్ఘనిస్తాన్ లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పడగొట్టి తాలిబన్లు అధికారం చేపట్టినప్పుడు కూడా మొదటిగా ప్రభుత్వాన్ని గుర్తించింది పాకిస్తాన్.. అయితే ఇప్పుడు ఇరు దేశాల సంబంధాలు ఘోరంగా దెబ్బతిన్నాయి.

పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ కయ్యానికి కాలుదువ్వాయి. పాక్-ఆఫ్ఘన్‌ సరిహద్దురేఖ డ్యూరాండ్ దగ్గర రెండు దేశాలు పరస్పరం బాంబులతో విరుచుకుపడుతున్నాయి. పాకిస్తాన్.. రష్యా, అమెరికా స్టయిల్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై వైమానిక దాడులు చేసింది. ప్రతిగా తాలిబన్లు వారి ఓన్ స్టయిల్‌లో పాకిస్తాన్‌ భూభాగంలోకి చొచ్చుకొచ్చి దాడులు జరిపారు. కారుబాంబులతో పాక్ పోస్టులను పేల్చివేశారు.

డిసెంబర్ 22 న తాలిబన్లకు మద్దతుగా ఉన్న తెహ్రీ క్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ సంస్థ వజీరిస్థాన్‌లో దాడి చేసింది. 16 మంది పాక్‌ సైనికులు చంపివేసింది. దీంతో ఆగ్రహించిన పాకిస్థాన్ డిసెంబర్ 24న ఆఫ్ఘనిస్థాన్‌లోని పక్తికా ప్రావిన్స్‌లో వైమానిక దాడులు చేసింది. ఆరు తాలిబన్ పోస్టులను ధ్వంసం చేసి 40 పోస్టులను స్వాధీనం చేసుకుంది. పాకిస్థాన్ వైమానిక దాడిలో 51 మంది చనిపోయారు. మృతిచెందినవారిలో 20 మంది తాలిబన్లతో పాటు శరణార్థులుగా ఉన్న చిన్నారులు, మహిళలు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

పాక్‌ దాడిపై మండిపడ్డ ఆఫ్ఘనిస్తాన్.. దక్షిణ వజీరిస్థాన్‌లోని పాకిస్తాన్ ఆర్మీ పోస్టును ధ్వంసం చేసింది. పాకిస్థాన్ ఆర్మీకి చెందిన 17 పోస్టులను తాలిబన్లు స్వాధీనం చేసుకుంది. వజీరిస్థాన్‌లోని పలు గ్రామాలను తాలిబన్లు ఆక్రమించుకున్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పాకిస్థాన్ ఆర్మీ పోస్టును కారు బాంబుతో పేల్చివేశారు తాలిబన్లు. మొత్తం 19 మంది పాక్‌ సైనికులను హతమార్చారు. బలూచిస్థాన్‌లోని పాక్‌ ఆర్మీ పోస్టులపైనా ఎటాక్ చేశారు.

పాకిస్తాన్‌కు చెందిన బలూచిస్తాన్‌ లిబరేషన్ ఫ్రంట్‌, తెహ్రీ క్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ సంస్థలు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లకు మద్దతు ప్రకటించాయి. పాక్ ప్రభుత్వాన్ని పడకొట్టి ఆ దేశంలో షరియా చట్టాన్ని అమలు చేయాలన్నదే తెహ్రీ క్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ సంస్థ లక్ష్యం. ప్రత్యేక బలుచిస్తాన్‌ దేశాన్ని ఏర్పాటు చేయాలన్నది బలూచిస్తాన్‌ లిబరేషన్ ఫ్రంట్‌ లక్ష్యం. ఆఫ్ఘన్‌ తాలిబన్లకు తోడు పాక్‌కు వ్యతిరేకంగా ఒకేసారి రెండు సంస్థలు విరుచుకుపడటం.. పాకిస్తాన్‌కు మింగుడు పడటంలేదు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం