Rewind@25: ఈ పాతికేళ్ల కాలగమనం.. ప్రపంచానికి నేర్పిన పాఠాలేంటి? గొప్ప మార్పులేంటి?
కరోనా కాటు.. సునామీ పోటు.. ఉగ్రవాదం.. యుద్ధోన్మాదం.. టెక్నాలజీ కొత్తపుంతలు.. అంతరిక్ష వింతలు.. మోదీకి హ్యాట్రిక్ పట్టం.. చారిత్రక అయోధ్య ఘట్టం.. ఇవన్నీ సంచలనమే.. ఈ శతాబ్దానికి 25 ఏళ్లుః ఈ పాతికేళ్ల పరిణామాలేంటి? దేశంలో.. తెలుగు రాష్ట్రాల్లో.. అంతర్జాతీయంగా జరిగిన గొప్ప మార్పులు.. ఘటనలు.. అభివృద్ధి.. రౌండప్ 2024.. ఓ లుక్కెయండి..

మిలీనియం తర్వాత ఈ శతాబ్దంలో పాతకేళ్ల మైలురాయి దాటేశాం. 2000 తర్వాత ప్రపంచ ముఖచిత్రమే మారిపోయింది. ఈ పాతికేళ్లలో ఎన్నో సవాళ్లు ఎదుర్కుంది. ఎన్నన్నో కొత్త పాఠాలు నేర్చుకుంది. యావత్ ప్రపంచాన్ని కరోనా కుదిపేసింది. లక్షల ప్రాణాలు గాల్లో కలిపేసింది. క్లిష్టపరిస్థితుల్లోనూ ఎలా బతకాలో ఈ మహమ్మారి నేర్పింది. రెండున్నరదశాబ్దాల్లో సాధించిన సాంకేతిక విప్లవం మరో ప్రపంచాన్ని కళ్లముందు ఉంచింది. ఐఫోన్, ఫేస్‌బుక్‌లాంటి ఆవిష్కరణలు స్మార్ట్‌గా బతకడం నేర్పించాయి. రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయిల్-హమాస్ యుద్ధాలు ఎలా బతక్కూడదో ప్రపంచానికి గుణపాఠంగా మిగిలాయి. ఉగ్రవాద దాడులతో అగ్రరాజ్యం అట్టుడికింది. అంతర్యుద్ధాలు, తిరుగుబాట్లు కొన్ని దేశాలను కుదిపేశాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ ప్రతీకారదాడులు ప్రపంచాన్ని భయపెట్టాయి. పదిహేడేళ్లక్రితం ప్రపంచాన్ని వణికించిన ఆర్థికమాంద్యం.. ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులా ప్రపంచాన్ని హెచ్చరిస్తూనే ఉంది. ఈ శతాబ్దం ఆరంభంలోనే అగ్రరాజ్యంపై పంజా విసిరింది ఉగ్రవాదం. ప్రపంచ ఉగ్రవాద చరిత్రలోనే కనీవినీ ఎరుగని దాడి అది. 2001 సెప్టెంబరు 11న న్యూయార్క్ నడిబొడ్డున నరమేథానికి తెగబడ్డాయి ఉగ్రమూకలు. విమానాలతో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ని నేలమట్టం చేశారు. ఈ దాడిలో దాదాపు 9వేలమంది మృత్యువాత పడ్డారు. ఈ ఎటాక్‌కి మాస్టర్‌మైండ్ బిన్‌లాడెన్‌ని పదేళ్ల తర్వాత హతమార్చింది అగ్రరాజ్యం. 9/11 దాడుల తర్వాత మూడేళ్లకే మరో ఊహించని విపత్తుతో ఉక్కిరిబిక్కిరైంది యావత్ ప్రపంచం. ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో 2004 డిసెంబరు 26న 9.2 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం.. పెను విపత్తుని ప్రపంచానికి పరిచయం చేసింది. సునామీతో సముద్రం...
