కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఈ రాశిలో శుక్ర, శనుల సంచారం వల్ల రాజయోగాలు కలిగాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. ప్రాభవం, ప్రాధాన్యం వృద్ధి చెందుతాయి. దశమ స్థానంలో బుధుడు, లాభ స్థానంలో రవి కూడా బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు తగ్గి, లాభాలు పెరుగుతాయి. ముఖ్యంగా జీవితంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొన్ని వ్యక్తిగత, కుటుంబ సంబంధమైన కష్టనష్టాల నుంచి బయటపడడం జరుగుతుంది. విదేశీ యానా నికి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది. నెలంతా శ్రమ తక్కువ లాభాలు ఎక్కువ అన్నట్టుగా సాగిపోతుంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. దుర్గాదేవి స్తోత్రం పారాయణ చేయడం వల్ల అనేక శుభాలు, లాభాలు కలుగుతాయి.