- Telugu News Photo Gallery These items should not be bought on Saturday, Check Here is Details in Telugu
Spiritual: శనివారం ఈ వస్తువులు కొంటున్నారా.. అయితే జాగ్రత్త!
రోజుల్లో కొన్ని రోజులకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఆ రోజుల్లో కొన్ని పనులు చేస్తే విజయం సాధిస్తారని, నష్ట పోతారని చెబుతూ ఉంటారు. అలానే కొన్ని రకాల వస్తువులను శనివారం రోజు కొనకూడదని, ఇంటికి కూడా తీసుకు రాకూడదని పండితులు చెబుతున్నారు..
Updated on: Dec 31, 2024 | 1:57 PM

సాధారణంగా ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు. ఫలానా రోజు ఇవి చేయకూడదని, కొన్ని వస్తువుల కొనకూడదని అంటూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో ఎవరూ పట్టించుకోకుండా కొట్టి పారేస్తున్నారు. ఇలా శని వారం రోజు కూడా కొన్ని వస్తువులు కొనకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది.

శని ప్రభావం మనపై పడకూడదంటే కొన్ని రకాల వస్తువులను శని వారం రోజున కొనకూడదు. ఇంటికి కూడా తెచ్చుకోకూడదు. వాటికి దూరంగా ఉండమని చెబుతారు. మరి ఈ వస్తువులు ఏంటో మీరు కూడా చూసేయండి.

శనివారం రోజున ఇనుముతో చేసిన వస్తువులను పొరపాటున కూడా తీసుకు రాకూడదు. ఇనుముతో చేసిన వస్తువులు కానీ, చెత్త వాహనాలు కానీ శనివారం రోజున ఇంటికి తీసుకు రాకూడదు. మంచి ఘడియలు మినహాయించి శనివారం రోజు కొత్త వాహనాలను కూడా కొనవద్దని చెబుతూ ఉంటారు.

అదే విధంగా శనివారం ఉప్పును కూడా కొనకూడదు. ఎవరి దగ్గర నుంచి కూడా అప్పుగా తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల శని ప్రభావం మనపై పడుతుందని ఎప్పటి నుంచో ఉన్న విశ్వాసం.

అలాగే ఆవ నూనె, నువ్వుల నూనె, నలుపు రంగులో ఉండే వస్తువులు, బట్టలు, కలపతో తయారు చేసిన వస్తువులు కూడా శని వారం పూట కొనుగోలు చేయకూడదని, కొనకూడదని పండితులు చెబుతున్నారు.





























