Happy New Year: బకెట్ నీరు విసరడం నుంచి 12 ద్రాక్ష పండ్లు తినడం వరకు.. న్యూ ఇయర్‌కు వింత పద్ధతుల్లో వెల్కం చెప్పిన దేశాలు..
ప్రపంచంలో అనేక దేశాలు 2025 సంవత్సరంలో అడుగు పెట్టాయి. అయితే వివిధ దేశాలు కొత్త ఏడాదికి భిన్నంగా స్వాగతం చెప్పారు. భిన్నంగా శుభాకాంక్షలు చెప్పుకున్నారు. చెక్ రిపబ్లిక్ దేశంలో యాపిల్ ను కట్ చేసి స్వాగతం చెబితే.. లాటిన్ అమెరికాలో ద్రాక్ష పండ్లను తిని నూతన సంవత్సరానికి వెల్కం చెప్పారు. ఈ రోజు ప్రపంచంలోని ఏ దేశం నూతన సంవత్సరాన్ని ఎలా ఎంత భిన్నమైన శైలిలో వెల్కం చెప్పిందో తెలుసుకుందాం
2025 సంవత్సరంలో ప్రపంచంలో అనేక దేశాలు అడుగు పెట్టాయి. అయితే నూతన సంవత్సర వేడుకలు కేవలం డ్యాన్స్, శుభాకాంక్షలు, బాణాసంచా వెలుగులకే పరిమితం కాలేదు. ప్రపంచంలో చాలా దేశాలు కొత్త సంవత్సరాన్ని చాలా ప్రత్యేకమైన రీతిలో జరుపుకున్నాయి. ఎన్నో ఆశలతో 2025 సంవత్సరంలో అడుగు పెట్టిన సందర్భంగా ప్రపంచంలోని ఏ దేశం నూతన సంవత్సరాన్ని స్వాగతించిందో.. ఎంత భిన్నమైన శైలితో జరుపుకున్నారో తెలుసుకుందాం.
చెక్ రిపబ్లిక్లో పండ్లు కట్ చేసి స్వాగతం
చెక్ రిపబ్లిక్లో నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రత్యేకమైన సంప్రదాయంలో జరుపుకున్నారు. ఇక్కడ పండ్లు కోసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే ఆచారం ఉంది. కొత్త సంవత్సరం ఎలా ఉంటుందో అంచనా వేయడానికి ప్రజలు ఆపిల్‌ను రెండు భాగాలుగా కట్ చేసి.. యాపిల్ మధ్యలో ఉన్న ఆకారాన్ని బట్టి కొత్త సంవత్సరం తమకు ఎలా ఉంటుందో అంచనా వేస్తారు. ఆపిల్ మధ్యలో నక్షత్రం ఆకారం ఉంటే కొత్త సంవత్సరం అదృష్టవంతంగా, సానుకూలంగా ఉంటుంది. అదే సమయంలో ఆపిల్ మధ్యలో క్రాస్ ఆకారంలో ఉంటే తమకు ఏడాది మొత్తం కష్టంగా సాగుతుందని భావిస్తారు.
12 ద్రాక్ష పండ్లను తిని స్వాగతం చెప్పిన దేశాలు
లాటిన్ అమెరికాలో, స్పెయిన్ , ఇండోనేషియాలో నూతన సంవత్సరాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఆ దేశ ప్రజలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు.. కొత్త ఏడాదిలో అడుగు పెట్టె సమయం అంటే అర్ధరాత్రి కంటే ముందు ద్రాక్షను తింటారు. ప్రతి ఒక్కరూ రాత్రి 12 గంటలలోపు 12 ద్రాక్షపండ్లను తిని కొత్త ఏడాదికి స్వాగతం చెప్పారు. ఇలా చేయడం వలన కొత్త సంవత్సరం అదృష్టం తెస్తుందని నమ్మకం.
ముద్దులతో న్యూ ఇయర్ కి వెల్కం చెప్పే జర్మన్ ప్రజలు
జర్మనీలో నూతన సంవత్సరాన్ని జరుపుకునే సంప్రదాయం కొంత భిన్నం.. ఇక్కడ ప్రజలు అర్ధరాత్రి ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటూ న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సంప్రదాయం నాలుగో శతాబ్దం నుంచి కొనసాగుతోంది.
కుర్చీ జంప్ వేడుకతో డెన్మార్క్‌లో న్యూ ఇయర్ వేడుకలు
డెన్మార్క్‌లో గడియారం అర్ధరాత్రి కొట్టగానే.. కొత్త ఏడాదికి వెల్కం చెప్పడానికి ప్రజలు కుర్చీలు ఏర్పాటు చేసుకుని వాటి పై నుంచి దూకుతూ వేడుకలను జరుపుకున్నారు. సంవత్సరం చివరి క్షణాల్లో.. కొత్త ఏడాది ఎంట్రీ సమయంలో ఎవరు ఎంత ఎక్కువ దూకుతారో.. వారు ఆ ఏడాది నెగెటివ్ ఎనర్జీకి దూరంగా ఉంటారని నమ్మకం. అంతేకాదు ఇలా చేయడం వలన ఏడాది పొడవునా పాజిటివ్ ఎనర్జీతో ఉంటారని భావిస్తారు.
అలల మధ్య ఆనందం:
బ్రెజిల్‌లో న్యూ ఇయర్ కౌంట్‌డౌన్ కొన్ని రోజుల ముందుగానే ప్రారంభమయింది. కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పడానికి ప్రజలు పువ్వులు, దండలు, ప్రసాదాలతో అందమైన సముద్ర తీరానికి చేరుకున్నారు. అలల మధ్య వేడుకలను జరుపుకుని సముద్ర దేవతని పూజించారు.
బకెట్ తో నీరు విసిరి న్యూ ఇయర్ కు వెల్కం
క్యూబాలో డిసెంబర్ 31 రాత్రి ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకుని ఆ మురికి నీటిని రోడ్డుపై విసిరారు. ఇలా చేయడం వెనుక ఉన్న నమ్మకం ఏమిటంటే, గత సంవత్సరంలో పేరుకుపోయిన దురదృష్టం, ప్రతికూల శక్తి అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు విసిరివేయబడింది అని. ఇలా చేయడంవలన దుఃఖాలు, సమస్యలు తీరి కొత్త ఏడాదిలో ఆనందంగా జీవిస్తామని నమ్మకం.
ఖాళీ సూట్‌కేస్‌లతో ఇంటి నుంచి బయటకు
లాటిన్ అమెరికాలో ప్రజలు ఖాళీ సూట్‌కేస్‌లతో తమ ప్రాంతంలో షికారు చేస్తూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. వ్యక్తులు ఇలా చేయడం వలన కొత్త ఏడాదిలో తమ ప్రయాణం, సాహసంతో సాగుతుందని నమ్ముతారు.
మరిన్ని అంతర్జతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..