Home Remedies: దగ్గు, జలుబు తర్వాత మీ వాయిస్ భారీగా మారిందా? ఈ హోం రెమెడీస్ బెస్ట్ మెడిసిన్
చలికాలంలో జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు సర్వసాధారణం. చాలా కాలం పాటు దగ్గు, జలుబుతో ఇబ్బంది పడి తగ్గిన తర్వాత .. కూడా కొంతమందికి గొంతు భారంగా మారడం ప్రారంభమవుతుంది. అప్పుడు మాట కూడా బరువుగా వస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం కొంతమంది మెడిసిన్స్ ను ఉపయోగిస్తారు. అయితే ఇలాంటి సమస్యలకు మందులు వాడడం కంటే వంటఇంట్లో దొరికే వస్తువులతో సింపుల్ టిప్స్ తో నయం చేసుకోవచ్చు.
చలికాలంలో దగ్గు, జలుబు చాలా సాధారణం. కొన్నిసార్లు దగ్గు, జలుబు తర్వాత గొంతు బొంగురుగా మారడం.. మాట భారీగా రావడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గొంతులో వాపు, దగ్గు వల్ల అధిక ఒత్తిడి లేదా గొంతు కండరాలపై అధిక ఒత్తిడి కారణంగా ఈ సమస్య వస్తుంది. చాలా సార్లు ఈ సమస్య చాలా ఎక్కువైతే దాని ప్రభావం గొంతు మీద కనిపిస్తుంది. దగ్గు , జలుబు తర్వాత, వ్యక్తుల స్వరం బరువుగా మారుతుంది. అప్పుడు మాట్లాడాలంటే ఇబ్బంది కలుగుతుంది. అంతేకాదు రోజువారీ కార్యకలాపాలపై కూడా ప్రభావితం చూపిస్తుంది.
ఈ సమస్యకు మందులు తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. అయితే ఇటువంటి సమస్యలకు మేడిసిన్స్ కంటే ఇంటి నివారణ చర్యలు త్వరగా ప్రభావవంతంగా పని చేస్తాయి. ఇలా గొంతు బొంగురు పోవడానికి ప్రధాన కారణం గొంతులో వాపు, దగ్గే సమయంలో గొంతుపై అధిక ఒత్తిడి లేదా వైరస్ ప్రభావం. ఈ సమస్య తీవ్రమైనది కాకపోవచ్చు. అయితే ఇది ఖచ్చితంగా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో వంటింటి చిట్కాలు సులభమైన , సురక్షితమైన ఎంపిక.
హోం రెమెడీస్ గొంతు వాపు ,బొంగురు గొంతును నయం చేయడంలో సహాయపడటమే కాదు ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మీ మాట భారంగా వస్తుంటే ఈ సమస్య నుంచి త్వరగా బయపాడడానికి త్వరగా పరిష్కరించాలనుకుంటే కొన్ని చర్యలను అనుసరించండి.
గోరువెచ్చని నీటితో పుక్కిలించండి
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పు కలపండి. రోజుకు 2-3 సార్లు పుక్కిలించాలి. ఇది గొంతు వాపును తగ్గిస్తుంది. గొంతును శుభ్రంగా ఉంచుతుంది. అటువంటి పరిస్థితిలో గొంతు భారంగా ఉన్నప్పుడల్లా గోరువెచ్చని నీటితో పుక్కిలించడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
అల్లం-తేనె రసం
తాజా అల్లం రసం తీసి అందులో తేనె మిక్స్ చేసి రోజుకు 2-3 సార్లు తీసుకోండి. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది గొంతు వాపునుంచి ఉపశమనం ఇవ్వడమే కాదు గొంతు సమస్యను నయం చేయడంలో సహాయపడుతుంది.
పసుపు పాలు
ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో అర టీస్పూన్ పసుపు కలిపి రాత్రి నిద్రించే ముందు తాగాలి. పసుపులో ఉండే యాంటీసెప్టిక్, హీలింగ్ గుణాలు గొంతు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పసుపు పాలు గొంతును శుభ్రపరచడంలో , స్వరాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
ఆవిరి పట్టండి
వేడి నీటిలో కొన్ని చుక్కల యూకలిప్టస్ నూనె వేసి.. తలను టవల్‌తో కప్పి, 5-10 నిమిషాలు ఆవిరి పట్టండి. ఈ ఆవిరి గొంతు నొప్పిని తగ్గిస్తుంది. గొంతులో ఏదో తెర అడ్డు పడినట్లు ఉంటే ఆ సమస్య నుంచి బయటపడడంలో సహాయపడుతుంది.
తులసి టీ
8-10 తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి, అందులో తేనె, నిమ్మరసం వేసి టీ లాగా త్రాగాలి. గొంతు వాపును తగ్గించడంలో పాటు బొంగురు గొంతును నయం చేయడంలో తులసి సహాయపడుతుంది. తులసి టీ శీతాకాలంలో అనేక ఇతర సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)