తాలిబన్ల ఆర్డర్.. ఇంట్లో వంట గదికి కిటికీలు వద్దే వద్దట !! ఎందుకంటే..

తాలిబన్ల ఆర్డర్.. ఇంట్లో వంట గదికి కిటికీలు వద్దే వద్దట !! ఎందుకంటే..

Phani CH

|

Updated on: Jan 02, 2025 | 12:07 PM

ఆప్ఘానిస్థాన్‌లో తాలిబన్లు పెట్టే నిబంధనలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. రోజుకో రూల్‌తో అక్కడ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఆట, పాట, మాట ఇలా అన్నింటి మీద ఆంక్షలు పెట్టారు. దీంతో అక్కడి ప్రజలు స్వేచ్ఛను కోల్పోయి.. బహిరంగ జైల్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. మగతోడు లేకుండా విమానాలు ఎక్కొద్దని మహిళల కాళ్లకు సంకెళ్లు వేశారు.

విమానాలు ఎక్కనివ్వలేదు. ఇక బాలికలకు చదువు వద్దంటూ స్కూళ్లు మూసేశారు. ప్రభుత్వ ఉద్యోగులంతా గడ్డం పెంచుకోవాలని ఆదేశించారు. అలాగే విదేశీ దుస్తులను ధరించకూడదని, స్థానికంగా ఉండే దుస్తులే వేసుకోవాలని తేల్చి చెప్పారు. పాత ఆంక్షలనే జీర్ణించుకోలేకపోతుంటే.. తాలిబన్ ప్రభుత్వం మరో కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇంట్లో వంటగదికి కిటికీలు ఉండొద్దని నిబంధన విధించింది. అఫ్గానిస్థాన్‌ చేజిక్కించుకున్న తాలిబన్లు అక్కడి మహిళల హక్కులను కాలరాస్తునే ఉన్నారు. తాజాగా ఆ దేశ పాలకులు తీసుకువచ్చిన డిక్రీ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నూతనంగా నిర్మించే ఇళ్లల్లో మహిళలు బయటివారికి కనిపించేలా వంట గదికి కిటికీలు ఏర్పాటుచేయొద్దని ఆదేశాలు ఇవ్వడం నివ్వెరపరుస్తోంది. ‘‘వంట గదులు, ఇంటి ఆవరణ, నీటి కోసం బావుల వద్దకు వచ్చిన మహిళలు బయటివారికి కనిపిస్తే అభ్యంతరకర చర్యలకు దారి తీసే వీలుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్‌లో ‘ఒకే ఒక్కడు’ ఎన్ని రూ.లక్షల ఆర్డర్‌ చేశాడంటే..

శ్మశానంలో అస్తికల చోరీ.. ఎందుకంటే..

ట్రైన్ చక్రాల కింద వేలాడుతూ 250 కి.మీ. జర్నీ

వావ్.. పులులు ఇలా కూడా ప్రవర్తిస్తాయా ?? ఆశ్చర్యపోతూ కామెంట్లు చేస్తున్న నెటిజన్లు

కడుపు నిండా కల్లును తాగేస్తున్న రామచిలుకలు