శ్మశానంలో అస్తికల చోరీ.. ఎందుకంటే..
మనిషిలో పెరిగిపోయిన స్వార్థం ఎంతకైనా తెగించేలా చేస్తుంది.. ఆఖరికి మృతిచెందిన వారికి కూడా ఆత్మశాంతి లభించకుండా చేస్తున్నారు. మృతదేహాలను ఖననం చేసిన తర్వాత అస్తికలు అపహరిస్తున్నారు. దొంగిలించిన ఆ అస్తికలను క్షుద్ర పూజలకు ఉపయోగిస్తున్నారని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వరంగల్ శివారులో ఓ వ్యక్తి స్మశానవాటికలో అస్తికలు దొంగిలిస్తుండగా స్థానికులు పట్టుకున్నారు.
అతన్ని మందలించి వదిలేశారు. శ్మశాన వాటికలే టార్గెట్ గా జరుగుతున్న ఇలాంటి ఘటనలు ఇప్పుడు కలవరపెడుతున్నాయి. ఈ మధ్యకాలంలో క్షుద్ర పూజల ఘటనలు తరచుగా చూస్తున్నాం. క్షుద్ర పూజలలో ఉపయోగించే మనిషి అస్తికలు, పుర్రెను ఖననం చేసిన డెడ్ బాడీల నుండి సేకరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే హనుమకొండ శివారు భీమారం శ్మశాన వాటికలో జరిగిన ఘటన.. స్థానికులను ఆందోళనకు గురయ్యేలా చేసింది. ఓ గుర్తుతెలియని వ్యక్తి ఖననం చేసిన డెడ్ బాడీలను తవ్వి అందులో అస్థికలను పోగుచేసుకొని ప్లాస్టిక్ సంచిలో ఎత్తుకెళ్తుండగా.. స్థానికులు అతన్ని పట్టుకున్నారు. అయితే అమావాస్యకు ముందు ఈ విధంగా అస్తికలు సేకరించి క్షుద్ర పూజలకు ఉపయోగిస్తుంటారని భావిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రైన్ చక్రాల కింద వేలాడుతూ 250 కి.మీ. జర్నీ
వావ్.. పులులు ఇలా కూడా ప్రవర్తిస్తాయా ?? ఆశ్చర్యపోతూ కామెంట్లు చేస్తున్న నెటిజన్లు
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

