కడుపు నిండా కల్లును తాగేస్తున్న రామచిలుకలు

కడుపు నిండా కల్లును తాగేస్తున్న రామచిలుకలు

Phani CH

|

Updated on: Jan 02, 2025 | 11:49 AM

మనుషులే కాదు, పక్షులు కూడా ఈత కల్లు సేవిస్తున్నాయి. చెట్టు నుంచి వచ్చే తియ్యటి కల్లును లాగించేస్తున్నాయి. ఉదయం పూట సాయంత్రం పూట చెట్ల చుట్టూ తిరుగుతూ కడుపు నిండా కల్లు తాగి ఎంజాయ్ చేస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాలో ఈ అరుదైన దృశ్యం మీకు కనిపిస్తుంది. పచ్చని రామచిలకలు.. ఈత చెట్లపై, తాటి చెట్లపై దీని కోసమే స్పెషల్ గా వాలుతున్నాయి.

ఉదయాన్నే వాటికి ఇదే పని అన్నట్లుగా అక్కడక్కడే తిరుగుతూ.. స్థానికులు ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. ఎంచక్కా కల్లుముంతపై వాలి వాటి ముక్కుతో పొడిచి కల్లును సేవిస్తున్నాయి. ఆ దృశ్యాలను సెల్‌ఫోన్లలో బంధిస్తున్నారు స్థానికులు. చిలుకల సందడిని ఆసక్తిగా తిలకిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని యాదవ నగర్ సమీపంలో ఈత చెట్లు, తాటి చెట్లుపై రామ చిలుకలు కల్లును సేవిస్తున్నాయి. ఓ చిలుక ఈత కల్లు తాగుతుంటే మరో చిలక సెక్యూరిటీగా ఉండి పక్కనే కాపలా కాస్తుంది. అయితే ఈత కల్లును తాగేందుకు రామచిలుకలతో పాటు ఉడతలు, తేనెటీగలు పోటీగా వస్తున్నాయి. వాటిని దూరంగా తరిమి కొడుతున్నాయి ఇవి. రోజూ ఉదయం.. చెట్ల వద్దకు చిలుకలు గుంపు, గుంపుగా వస్తున్నాయి. కల్లు రుచిగా ఉండటంతో కడుపు నిండా తాగేస్తున్నాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాబా వంగా జోస్యం.. 2025లో జరగబోయే దారుణాలివేనా

TOP 9 ET News: వైలెంట్‌గా చిరు క్యారెక్టర్దిమ్మతిరిగే అప్డేట్

కారులో డ్రైవర్ కు బిగ్ షాకిచ్చిన బిచ్చగాడు

ఒకే చెట్టుకు మూడు రకాల మందార పూలు

పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే.. తెల్లజుట్టు నల్లగా..