కారులో డ్రైవర్ కు బిగ్ షాకిచ్చిన బిచ్చగాడు

కారులో డ్రైవర్ కు బిగ్ షాకిచ్చిన బిచ్చగాడు

Phani CH

|

Updated on: Jan 01, 2025 | 12:27 PM

ప్రతీ ఒక్కరూ.. చేతిలోకి స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాక సోషల్‌ మీడియాను ఫాలో కావడం ఓ ట్రెండ్‌గా మారింది. ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. అందులో కొన్ని వీడియోలు మనల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కొన్ని ఆసక్తికరంగా ఉంటే.. మరికొన్ని ఫన్నీగా ఉండి వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫన్నీ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

కారులో కూర్చున్న వ్యక్తికి వికలాంగుడైన ఓ బిచ్చగాడు దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు. ఆ వీడియో చూసిన వారందరూ నవ్వుకుంటున్నారు. @introvert_hu_ji అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ కారు రోడ్డు పక్కన ఆగి ఉంది. ఆ కారు వద్దకు ఓ వికలాంగుడు వచ్చి డబ్బులు అడిగాడు. అందుకు కారులోని వ్యక్తి స్పందిస్తూ.. దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తే రూ.50 ఇస్తానని కర్రల సహాయంతో నడుస్తున్న ఆ బిచ్చగాడికి చెప్పాడు. దీంతో ఆ బిచ్చగాడు కర్రల సహాయంతో కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లి, తిరిగి కర్రల సహాయం లేకుండా పరిగెత్తుకుంటూ వచ్చేశాడు. అంటే అతడు నిజంగా వికలాంగుడు కాదు.. బిచ్చమెత్తుకోవడం కోసం వికలాంగుడిగా నటిస్తున్నాడన్నమాట.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒకే చెట్టుకు మూడు రకాల మందార పూలు

పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే.. తెల్లజుట్టు నల్లగా..

భారతదేశంలో మొట్టమొదటి విడాకుల కేసు ఇదే

టీ తాగి వెళ్లండి అని ఇంటికి పిలిచింది.. ఆశగా వెళ్ళాడు.. చివరికి

నాని HIT3 సెట్‌లో విషాదం.. ఉన్నట్టుండి షూటింగ్‌లో ఆమె మృతి