ఒకే చెట్టుకు మూడు రకాల మందార పూలు
పూల మొక్కల్లో రకరకాల మొక్కలు ఉంటాయి. గులాబీ, మందార మొక్కల విషయానికి వస్తే ఇందులో ఎన్నో రంగులు ఉంటాయి. సాధారణంగా మందారపూలు అనగానే ఎర్రని రంగులో పూసే పూలే ముందుగా గర్తొస్తాయి. కానీ వీటిలో కూడా అనేక రకాల పూలు ఉన్నాయి. అయితే అవన్నీ వేటికవే విడివిడిగా చెట్లకు పూస్తాయి. కానీ ఓ మందార చెట్టు మాత్రం మూడు రంగుల్లో పూలు పూస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అవును, ఒకే మందార చెట్టుకు ఎరుపు, పసుపు, గులాబీ రంగుల్లో పూలు పూసాయి. భద్రాద్రి జిల్లా చర్ల మండల కేంద్రంలోని తోటమల్ల నిరోష అనే గృహిణి పెంచుకుంటున్న మందారం చెట్టు 8 అడుగులకు ఎత్తు పెరిగింది. స్ధానికులు ఓ మందార చెట్టు ఇంత ఎత్తు ఎదుగుతుందా అని ఆశ్చర్యపోయారు. ఇక్కడ మరో విశేషమేంటంటే .. ఆ మందరా చెట్టు మూడు రంగుల్లో పూలు పూస్తూ మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ మందార చెట్టును చూసేందుకు స్థానికులు క్యూ కడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే.. తెల్లజుట్టు నల్లగా..
భారతదేశంలో మొట్టమొదటి విడాకుల కేసు ఇదే
టీ తాగి వెళ్లండి అని ఇంటికి పిలిచింది.. ఆశగా వెళ్ళాడు.. చివరికి
వైరల్ వీడియోలు
Latest Videos