భారతదేశంలో మొట్టమొదటి విడాకుల కేసు ఇదే

భారతదేశంలో మొట్టమొదటి విడాకుల కేసు ఇదే

Phani CH

|

Updated on: Jan 01, 2025 | 12:23 PM

భారత్‌లోని తొలి విడాకులు కేసు పెట్టింది ఎవరో తెలుసా? ఒక మహిళ. ఆమె తెగువ ఏకంగా విక్టోరియా మహారాణినే కదిలించిందంటే ఆమె సాహసాన్ని మెచ్చుకోవాల్సిందే. అంతే కాదు విదేశాల్లో పాశ్చాత్య వైద్యంలో సర్జన్‌గా ప్రాక్టీస్‌ చేసిన మొదటి వైద్యురాలు కూడా ఆమే. ఒక సాధారణ మహిళ చదువుకోవాలనే తపనతో వివాహ బంధాన్ని వదులుకుంది.

ఎన్నో విమర్శలు ఎదురైనా సరే మహిళల హక్కుల కోసం పోరాడింది. ఆమే విడాకులు తీసుకున్న మొట్టమొదటి హిందూ మహిళ. ఆమె విడాకుల కేసులో స్వయంగా బ్రిటన్‌ క్వీన్‌ జోక్యం చేసుకొని ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చేసింది. ఇంతకీ ఆమె ఎవరు? ఆ కాలంలో అంతటి తెగువను ఎలా పదర్శించగలిగారు? ఈ ఘటన 1885లో జరిగింది. విడాకులు అనే పదం మన దేశంలో కనిపించే అవకాశం లేని రోజులవి. అలాంటి రోజుల్లో ధైర్యంగా కోర్టులో పోరాడి విడాకులు తీసుకున్నారు రుఖ్మాబాయి రౌత్‌. భారతదేశంలో డైవర్స్ తీసుకున్న మొట్టమొదటి హిందూ మహిళ రుఖ్మాబాయి. ఈమెకు 11 ఏళ్ల ప్రాయంలోనే దాదాజీ భికాజీ అనే 19 ఏళ్ల అబ్బాయితో వివాహం జరిగింది. అయితే మెడిసిన్‌ చేయాలన్న తపనతో రుఖ్మాబాయి తన తల్లిదండ్రుల వద్దే ఉండి చదువుకునేది. అది నచ్చని ఆమె భర్త తన వద్దే ఉండాలని పట్టుబట్టాడు. అందుకు రుఖ్మాబాయి నిరాకరించింది. దీంతో అతడు ఆమెపై కేసు పెట్టాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టీ తాగి వెళ్లండి అని ఇంటికి పిలిచింది.. ఆశగా వెళ్ళాడు.. చివరికి

నాని HIT3 సెట్‌లో విషాదం.. ఉన్నట్టుండి షూటింగ్‌లో ఆమె మృతి

అల్లు అర్జున్‌కు యాటిట్యూడ్, బలుపు ఉంటే తప్పేంటబ్బా ??