అల్లు అర్జున్‌కు యాటిట్యూడ్, బలుపు ఉంటే తప్పేంటబ్బా ??
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం, ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరడంతో తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు రావడం వల్లే రేవతి చనిపోయిందని ఆయనపై పోలీసులు కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేశారు.
అయితే బన్నీ బెయిల్‌పై బయటకు వచ్చాడు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సంధ్య థియేటర్ ఘటన జరిగినప్పటి నుంచి అల్లు అర్జున్ పై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ నడుస్తోంది. కొందరు నెటిజన్లు బన్నీ ప్రవర్తనా తీరును తప్పుపడుతూ పోస్టులు షేర్ చేస్తున్నారు. వీటికి అల్లు అర్జున్ అభిమానులు కూడా స్ట్రాంగ్ గానే కౌంటర్లు ఇస్తున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత ఘాటుగా రియాక్ట్ అయ్యింది. ఈ మేరకు అల్లు అర్జున్ కు మద్దతుగా ఆమె మాట్లాడుతోన్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అల్లు అర్జున్‌కు యాంటీగా ఒకటే పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు. అల్లు అర్జున్ పుట్టడమే గోల్డెన్ స్పూన్ తో కాదురా డైమండ్ స్పూన్‌తో పుట్టాడు. అతనికి యాటిట్యూడ్, బలుపు ఉంటే తప్పేంటి? అంటూ తన పోస్ట్ చేసిన వీడియోలో చెప్పారు మాధవీలత.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రామ్ చరణ్ కెరీర్ కు ఇది గేమ్ ఛేంజర్ అవుతుందా ??
OG అంటూ ఫ్యాన్స్ అరుపులు.. చిరాకుతో అరిచిన పవన్
పోలీసులకు సంధ్యా థియేటర్ నుంచి ఘాటు రిప్లయ్
వారసత్వం కాదు.. పనితనం !! అన్నకు మంత్రి పదవిపై పవన్ కామెంట్స్