చరణ్ సినిమా ఈవెంట్‌కు పవన్ ?? దిల్ రాజు పర్సనల్ రిక్వెస్ట్
గేమ్ చేంజర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ. జనవరి 10న రిలీజ్ అవుతున్న ఈ మూవీ వైపే ఇప్పుడందరి చూపూ ఉంది. అలాంటిది ఈ పరిస్థితుల్లో దిల్ రాజు డిప్యూటీ సీఎం పవన్‌ను కలవడంతో.. ఈ సినిమా పై బజ్ కాస్తా ఆకాశాన్ని అంటింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ వస్తున్నారనే న్యూస్ నెట్టింట వైరల్ అవ్వడం మొదలైంది.
ఇక అసలు విషయం ఏంటంటే..! తెలంగాణ FDC చైర్మన్, గేమ్ ఛేంజర్ ప్రొడ్యూసర్.. అమరావతిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌తో భేటీ అయ్యారు. గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్‌ను దిల్ రాజు ఆహ్వానించారు. గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు మీరు వస్తే బాగుంటుందంటూ రిక్వెస్ట్ చేశారు. ఇక గేమ్ చేంజర్ సినిమా టికెట్ రేట్ల పెంపుపై కూడా పవన్ తో మాట్లాడారు దిల్ రాజు. అంతేకాదు ఈ భేటీలో చిత్ర పరిశ్రమకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా తెలంగాణలో చోటు చేసుకున్న పరిణామాలు కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇక ఈ విషయం కాస్త పక్కకు పెడితే.. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుక విజయవాడలో జరగనుంది. ఇక ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అక్కినేనిపై మోదీ ప్రశంసల వర్షం !!
గోటితో పోయేదానికి గొడ్డలి దాకానా.. చురకలంటించిన పవన్ కళ్యాణ్
అన్ స్టాపబుల్ షోకు గ్లోబల్ స్టార్.. బాలయ్య, చరణ్ కాంబో అదుర్స్