బాలయ్య షోకు డాకు మహరాజ్ !! ఇక రచ్చ రంబోలా అంతే !!

బాలయ్య షోకు డాకు మహరాజ్ !! ఇక రచ్చ రంబోలా అంతే !!

Phani CH

|

Updated on: Dec 31, 2024 | 11:29 AM

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోన్న టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ టాక్ షోలో సందడి చేశారు. తమ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం అన్ స్టాపబుల్ నాలుగో సీజన్ రన్ అవుతోంది.

ఈ సీజన్ లో ఇప్పటికే ఏడు ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. ఇక అన్ స్టాపబుల్ ఎనిమిదో ఎపిసోడ్ కు డాకు మహారాజ్ టీమ్ వచ్చేస్తోంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ బాబీ కొల్లి, నిర్మాత నాగవంశీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అతిథులుగా.. బాలయ్య టాక్ షోకు హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఇక బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న చిత్రం డాకు మహారాజ్. బాబీ తెరకెక్కిస్తోన్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా కనిపించనున్నాడు. అలాగే ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా జనవరి 4న అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.+

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉల్లిపాయ అడిగిన డెలివరీ బాయ్.. టెన్షన్ పడ్డ ఫ్యామిలీ..

టిప్‌ తక్కువ ఇచ్చిందని కస్టమర్‌ను పొడిచేసిన డెలివరీ గాళ్‌

ప్రియురాలికి వజ్రాల కళ్లజోడు బుక్ చేసి.. అడ్డంగా బుక్కయిన రూ.13 వేల జీతగాడు !!

ఆవుకు సీమంతం.. ప్రత్యేక పూజలు, నైవేద్యాలు..

ఫ్రిజ్ వాడుతున్నారా ?? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి !!

Published on: Dec 31, 2024 11:28 AM