ఆవుకు సీమంతం.. ప్రత్యేక పూజలు, నైవేద్యాలు..
మహిళలకు సీమంతం చేయడం మామూలే. కానీ మీరు ఎప్పుడైనా గోవులు, ఇతర పెంపుడు జంతువులకు సీమంతం చేయడం చూసి ఉంటారా? ఈమధ్యకాలంలో ఈ ట్రెండ్ ఊపందుకుంది. మెదక్ జిల్లాలో కూడా గోవుకు గ్రాండ్‌గా సీమంతం చేశారు. తూప్రాన్ మున్సిపాలిటీలో గోమాతకు సీమంతాన్ని నిర్వహించారు.
మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డులో నివాసముంటున్న ఆర్ఎంపీ వైద్యులు ప్రసాద్, మాధవి దంపతులు గత కొంతకాలంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా ఈ మధ్యనే ఒక ఆవును కొనుగోలు చేశారు. దీంతో అప్పటినుండి వారు ఇబ్బందులు తొలగిపోయి చాలా సంతోషంగా జీవిస్తున్నారు. ఈ ఆవు గర్భం దాల్చడంతో.. దీనిని జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు సీమంతం కూడా జరిపారు. ఇక ఈ గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రసాద్, మాధవి దంపతులు.. దీనికి పలు రకాల నైవేద్యాలను సమర్పించారు. గోమాతలను రక్షించి భూమిని కాపాడుకోవాలన్న సంకల్పంతో ఆవుల రక్షణ కోసం కృషి చేస్తున్నామన్నారు. భారతీయ సంప్రదాయంలో గోవును దైవంగా భావించడం, తమ ఇంటి బిడ్డగా చూసుకోవడం చాలాచోట్ల కనిపిస్తుంది. అలానే వీళ్ళు కూడ గోమాతను తమ ఇంటి ఆడబిడ్డగా భావించి ఇలా సీమంతం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫ్రిజ్ వాడుతున్నారా ?? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి !!
గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అయ్యారు.. చివరికి ఇలా ఇరుక్కుపోయారు
బ్యాంకులు.. వచ్చే జనవరిలో 15 రోజులే పని చేస్తాయి..
కొత్త సంవత్సరంలో రాబోయే మార్పులు ఇవే
నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో ఉన్నదంతా దోచుకుంటారు.. జాగ్రత్త !!