నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో ఉన్నదంతా దోచుకుంటారు.. జాగ్రత్త !!
ప్రతి పండగను, సందర్భాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్న సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం ‘నూతన సంవత్సర శుభాకాంక్షల’ పేరుతో ఉన్నదంతా దోచుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వారి చేతికి చిక్కి ఖాతాలు ఖాళీ చేసుకోవడమే కాదు, ఫోన్లలో ఉన్న వ్యక్తిగత సమాచారం అంతా పోగొట్టుకోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మరో నాలుగు రోజుల్లో కొత్త ఏడాదిలో అడుగుపెట్టబోతున్నాం. డిసెంబరు 31 అర్ధరాత్రి 12 గంటల నుంచే ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం సహజం. ఈ క్రమంలో సాధారణంగా కాకుండా రకరకాల చిత్రాలు, సందేశాలను మీ పేరుతో సహా తయారు చేసుకొని పంపవచ్చని, ఇందుకోసం ఈ కింది లింకుపై క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే చాలని సెల్‌ఫోన్లకు సందేశాలు వస్తున్నాయి. పొరపాటున వాటిపై క్లిక్ చేశారంటే తిప్పలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్ ఏపీకే ఫైల్స్ రూపంలో పంపే ఈ గూఢచర్య అప్లికేషన్ ఒకసారి మీ ఫోన్లోకి జొరబడిందంటే అందులోని సమస్త సమాచారం నేరగాళ్ల అధీనంలోకి వెళ్లిపోతుంది. బ్యాంకు ఖాతాల వివరాలు, ఫొటోలు, వీడియోలు, కాంటాక్ట్ నంబర్లు, ఇతర ఫైల్స్ అన్నీ తీసేసుకుంటారు. కాబట్టి నూతన సంవత్సర సందేశాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పెద్దఎత్తున సందేశాలు పంపుతున్న సైబర్ కేటుగాళ్లు రాబోయే రెండు, మూడు రోజుల్లో తమ దాడుల్ని తీవ్రతరం చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. సో.. బీకేర్‌ఫుల్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ ఒక్క కారణంతో.. 2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసిన సాయి పల్లవి
Vishnu Priya: అందుకే.. పృథ్వీతో చనువుగా ఉన్నా..
ఇప్పుడు ఈ స్టార్ హీరోలకు.. ఏపీ ప్రభుత్వమే దిక్కా
Sonu Sood: CM చేస్తానంటూ ఓ పార్టీ ఆఫరిచ్చింది.. ఒక్క మాటతో షాకిచ్చిన సోనూ సూద్
TOP 9 ET News: దూసుకుపోతున్న పుష్ప2.. ఏకంగా బాహుబలి రికార్డ్ గల్లంతయ్యే ఛాన్స్