Solar Paint Cars: ఈ కార్‌లో జీవితాంతం ఫ్రీగా తిరిగేయచ్చు.! కార్ల బాడీపై సోలార్ ఫొటో..
పొల్యూషన్ తక్కువ, ప్రయాణించేందుకు అయ్యే ఖర్చు తక్కువని చాలా మంది ఎలక్ట్రిక్ కార్లు కొంటున్నారు. కానీ ఏదైనా దూర ప్రాంతానికి వెళ్లాలంటే కష్టం. ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ దూరం వెళ్లలేవు. ఎప్పటికప్పుడు చార్జింగ్ పెట్టాలి. అది కూడా గంటలకు గంటలు చార్జింగ్ అవుతాయి. అయితే భవిష్యత్తులో ఈ బాధ తప్పనుంది. మనం ఇంట్లోనో, చార్జింగ్ సెంటర్ లోనో చార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేకుండానే... వేల కిలోమీటర్లు తిరిగే అవకాశం రానుంది.
కార్లలో నేరుగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా ‘సోలార్ పెయింట్’ అభివృద్ధి చేసినట్టు మెర్సిడెస్ బెంజ్ కంపెనీ ప్రకటించింది. మనం ఇళ్లలో, అక్కడక్కడా సోలార్ ప్యానల్స్ చూసే ఉంటాం. అవి సూర్యరశ్మిని గ్రహించి ఉత్పత్తి చేసే విద్యుత్ తో ఇంట్లో పరికరాలను వాడుతుండటం కూడా తెలిసిందే. ఇప్పుడు తాము తయారు చేసిన ‘ఫొటో వోల్టాయిక్ పెయింట్’ కూడా అదే తరహాలో పనిచేస్తుందని మెర్సిడెస్ బెంజ్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. హానికారకం గాని, పర్యావరణ హితమైన రీతిలో ప్రత్యేకమైన నానో పార్టికల్స్, ఎలక్ట్రిక్ కండక్టర్లతో దీనిని రూపొందించినట్టు వెల్లడించారు. కార్ల బాడీపై సోలార్ ఫొటో వోల్టాయిక్ కోటింగ్ వేస్తారు. ఇందులోని ఎలక్ట్రిక్ కండక్టర్లను కారులోని బ్యాటరీ వ్యవస్థకు అనుసంధానం చేస్తారు. దీనితో పెయింట్ కోటింగ్‌లో ఉత్పత్తయ్యే విద్యుత్ బ్యాటరీకి చేరుతుంది. కారుపై వెలుగు పడినంత సేపూ చార్జింగ్ అవుతూనే ఉంటుంది. అంటే ప్రత్యేకంగా చార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేనట్టే. ఎక్కువ దూరం ప్రయాణించి బ్యాటరీ ఖాళీ అయి.. వెంటనే మళ్లీ ప్రయాణం చేయాల్సి వస్తేనే చార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. నిత్యం తక్కువ దూరాలకు వెళ్లేవారు అసలు చార్జింగ్ పెట్టాల్సిన అవసరమే ఉండదని మెర్సిడెస్ బెంజ్ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
సోలార్ పెయింట్ టెక్నాలజీని అమర్చిన వాహనంపై వెలుగు పడినంత సేపూ చార్జింగ్ అవుతూనే ఉంటుంది. దీనితో ఏడాదిలో సుమారు 12 వేల కిలోమీటర్ల దూరం తిరిగేందుకు సరిపడా చార్జింగ్ లభిస్తుందని మెర్సిడెస్ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. కారుపై సోలార్ కోటింగ్ ఏర్పాటు చేసి.. ఆపై ప్రత్యేకమైన రంగుల కోటింగ్ వేస్తారని.. దీనితో ఈ కార్లు మామూలు వాహనాల్లానే కనిపిస్తాయని వివరిస్తున్నారు.ఎక్కువగా ఎండ పడే ప్రాంతాల్లో ఈ సోలార్ పెయింట్ కార్లు వేగంగా, ఎక్కువగా చార్జింగ్ అవుతాయి. అంటే భారతదేశంలో ఇలాంటి కార్లతో ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అంతేకాదు ఈ టెక్నాలజీని కార్లలోనే కాదు బస్సులు, ఇతర పెద్ద వాహనాల్లోనూ వాడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.