Sonu Sood: CM చేస్తానంటూ ఓ పార్టీ ఆఫరిచ్చింది.. ఒక్క మాటతో షాకిచ్చిన సోనూ సూద్
దక్షిణాదితో పాటు బాలీవుడ్ సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సోనూ సూద్. తెరపై విలన్ పాత్రలు పోషిస్తున్నప్పటికీ నిజ జీవితంలో అతను రియల్ హీరో అనిపించుకున్నాడు. కొవిడ్ సమయంలో ఎవరూ చేయలేని మంచి పనులు చేసి మంచి పేరు వచ్చేలా చేసుకున్నాడు. ఇదే సమయంలో సోనూ సూద్ సేవ గురించి రోజుకో కథనాలు వచ్చాయి.
సోనూ సుద్ సహాయం పొందిన చాలా మంది తమ పిల్లలకు సోనూ సుద్ పేరు పెట్టారు. పలువురు రాజకీయ నేతలు కూడా సోనూ సుద్ర సేవను అభినందిస్తూ ట్వీట్లు చేశారు. కొన్ని రాష్ట్రాల గవర్నర్లు సోనూసూద్‌ను పిలిచి సన్మానించారు. పలువురు కేంద్ర మంత్రులు కూడా సోనూసూద్‌ను కలిసి సన్మానించారు. ఈ క్రమంలోనే సోనూసూద్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు పుకార్లు వచ్చాయి. కానీ తర్వాత అది అబద్ధమని తేలింది. ఇక తాజాగా హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, సోనూసూద్ తనకు అప్పట్లో వచ్చిన రాజకీయ ఆఫర్ల గురించి ఓపెన్ అయ్యాడు. తనకు సీఎం లేదా డీప్యూటీ సీఎం ఆఫర్లు వచ్చాయంటూ చెప్పి అందర్నీ షాకయ్యేలా చేశాడు. తన కామెంట్‌తో నెట్టింట వైరల్ అవుతున్నాడు ఇప్పుడు. ఎట్ ప్రజెంట్ పేదలకు సేవ చేయడాన్ని ప్రధాన పనిగా పెట్టుకున్న సోనూ.. తన సేవా కార్యక్రమాలతో స్టిల్ నెట్టింట వైరల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఓ ఇంటర్యూకు వెళ్లిన ఈయన.. తనకు జాతీయ స్థాయి నేతల నుంచి ఆ ఆఫర్లు వచ్చాయని చెప్పాడు. తనను రాజ్యసభ సభ్యుడిగా చేయాలనే ప్రతిపాదన కూడా ఓ పార్టీ నుంచి వచ్చిందని.. బయటపెట్టాడు. అయితే ఏ పార్టీ నుంచి, ఏ నేత ఆఫర్ ఇచ్చారనేది సోనూసూద్ వెల్లడించలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: దూసుకుపోతున్న పుష్ప2.. ఏకంగా బాహుబలి రికార్డ్ గల్లంతయ్యే ఛాన్స్
బీచ్‌లో ఫుడ్‌బాల్ అదరగొట్టిన శునకం.. వీడియో వైరల్
ఇంత వైల్డ్ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకుంటున్నాడని షాకిచ్చిన యువతి..
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే ??
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్.. కానీ ఇక్కడ ట్విస్ట్ తెలిస్తే మీ మతిపోతుంది !!