ఫ్రిజ్ వాడుతున్నారా ?? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి !!

ఫ్రిజ్ వాడుతున్నారా ?? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి !!

Phani CH

|

Updated on: Dec 30, 2024 | 8:35 PM

నేటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్‌లు నిత్యావసర వస్తువులుగా తయారయ్యాయి. అయితే వాటిని సరిగ్గా వినియోగించకపోయినా, రెగ్యులర్‌గా చెక్ చేస్తూ ఉండకపోయినా ఆ ఇంటి యజమానుల పట్ల అవే యమపాశాలుగా మారే అవకాశం ఉంది. తాజాగా ఏలూరు జిల్లా ఆగిరిపల్లి గ్రామంలో సాంబయ్య ఇంట్లో ఫ్రిజ్ పేలి ఇంటిలో సామాన్లు అన్నీ కాలిపోయాయి.

ఫ్రిజ్ కంప్రెషర్ పెరగడం వల్ల ప్రేలుడు సంభవించినట్లు ఫైర్ సిబ్బంది గుర్తించారు. అయితే కంప్రెషర్ పేలుడు సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ తరహా ఘటనలు పలు చోట్ల ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో అనేక చోట్ల ఫ్రిడ్జ్, ఏసీలో కంప్రెషర్‌లు అకస్మాత్తుగా పేలి తీవ్ర ఆస్తి నష్టం, ప్రాణనష్టం కలుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఫ్రిడ్జ్‌లు పదేపదే డోర్లు తీసి వాడడం, డోర్లు సరిగ్గా వేయకపోవడం వలన ఈ ప్రమాదాలు జరగవచ్చు అని టెక్నీషియన్లు చెప్తున్నారు. అంతేకాక ఏసీ లేదా రిఫ్రిజిరేటర్‌లో పనిచేయడానికి ముఖ్యమైన పరికరం కంప్రెషర్. ఇది ఒక రకమైన యాంత్రిక పరికరం. ఇది ఫ్రిజ్‌లో వాయువు లేదా గాలి ఒత్తిడిని పెంచడానికి ఉపయోగించబడుతుంది. గాలి కంప్రెష్ చేయడానికి ఉపయోగించడం ద్వారా గాలి పరిమాణాన్ని తగ్గించడం ద్వారా గాలి ఒత్తిడి పెరుగుతుంది. ఈ కంప్రెషర్లను రిఫ్రిజిరేటర్లు, ఏసీలు రెండింటిలోనూ ఉపయోగిస్తారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గూగుల్‌ మ్యాప్‌ను గుడ్డిగా ఫాలో అయ్యారు.. చివరికి ఇలా ఇరుక్కుపోయారు

బ్యాంకులు.. వచ్చే జనవరిలో 15 రోజులే పని చేస్తాయి..

కొత్త సంవత్సరంలో రాబోయే మార్పులు ఇవే

నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో ఉన్నదంతా దోచుకుంటారు.. జాగ్రత్త !!