బ్యాంకులు.. వచ్చే జనవరిలో 15 రోజులే పని చేస్తాయి..

బ్యాంకులు.. వచ్చే జనవరిలో 15 రోజులే పని చేస్తాయి..

Phani CH

|

Updated on: Dec 30, 2024 | 8:04 PM

కొత్త ఏడాది బ్యాంకు ఉద్యోగులకు బోలెడన్ని సెలవులు మోసుకొస్తోంది. ఈ వార్త బ్యాంకు ఉద్యోగులకు ఆనందం కలిగించేదే అయినా.. ఖాతాదారులకు మాత్రం కాస్త కంగారు పుట్టించే వార్తే. ఎందుకంటే ఏదైనా ముఖ్యమైన పనులు చేసుకోవలసి వస్తే బ్యాంకులకు హాలిడే ఉంటే అప్పుడు కస్టమర్స్‌కి ఇబ్బంది తప్పదు.

అందుకే ముందే బ్యాంకులు ఏ రోజు పనిచేస్తాయి? ఏ రోజు సెలవు ఉంటుంది అనే విషయాలు తెలుసుకుంటే దానిప్రకారం షెడ్యూల్‌ వేసుకోవచ్చు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రతి నెల బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. వినియోగదారులు ముందస్తుగా ఏయే రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకుంటే పనులు సులభమవుతాయి. సమయం వృథా కాకుండా ఆర్థిక నష్టం ఉండకుండా ప్లాన్‌ చేసుకోవచ్చు. అయితే ఈ సెలవులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. కొన్ని ప్రాంతీయ సెలవులయితే మరి కొన్ని జాతీయ సెలవులుంటుంటాయి. అందుకే ఆర్బీఐ ప్రతి నెలా హాలిడేస్ లిస్ట్ జారీ చేస్తుంటుంది. 2025 జనవరిలో బ్యాంకులకు ఏకంగా 15 రోజులు సెలవులున్నాయి. జనవరి 1 – న్యూ ఇయర్ సెలవు. జనవరి 2వ తేదీన కొత్త ఏడాది సందర్భంగా మిజోరాంలో బ్యాంకులకు సెలవు, మన్నం జయంతి సందర్భంగా కేరళలో బ్యాంకులకు సెలవు. జనవరి 5- ఆదివారంబ్యాంకులకు సాధారణ సెలవు. జనవరి 6 – గురు గోవింద్ సింగ్ జయంతి హర్యానా, పంజాబ్‌లో సెలవు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొత్త సంవత్సరంలో రాబోయే మార్పులు ఇవే

నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో ఉన్నదంతా దోచుకుంటారు.. జాగ్రత్త !!