Jio Pack: డేటా యూజర్లకు జియో షాక్.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా..
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో యూజర్లకు షాకిచ్చింది. రోజువారీ డేటా పరిమితి అయిపోయినప్పుడు వినియోగించే రూ.19, రూ.29 డేటా వోచర్ల వ్యాలిడిటీని కుదించింది. జియో వెబ్‌సైట్‌లో ప్లాన్లను పరిశీలిస్తే ఇప్పటికే కొత్త కాలపరిమితులు అమల్లోకి వచ్చాయని స్పష్టమవుతోంది.
రోజువారీ డేటా అయిపోయినప్పుడు, అదనపు డేటా అవసరమైనప్పుడు ఇంటర్నెట్ సేవలు పొందేందుకు ప్రత్యేక డేటా ప్యాక్‌లను అందిస్తోంది. రూ.19 ప్లాన్‌తో 1జీబీ డేటా, రూ.29 ప్లాన్‌తో 2జీబీ డేటా ఇస్తోంది. ప్రస్తుత ప్లాన్ గడువు ముగిసే వరకు ఈ డేటా వోచర్లకు వ్యాలిడిటీ ఉండేది. తాజాగా కాలవ్యవధిని కుదించింది. రూ.19 ప్లాన్ కాలవ్యవధిని ఒక్క రోజుకు పరిమితం చేసింది. రూ.29 ప్లాన్‌కు గడువును రెండు రోజులుగా నిర్ణయించింది. ప్రస్తుతం తక్కువ ధరలో రూ.11తో మరో డేటా ప్యాక్‌ను అందిస్తోంది. కేవలం ఒక గంట వ్యవధి కలిగిన ఈ ప్యాక్‌తో అపరిమిత డేటా పొందొచ్చు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.