కొత్త ఏడాదిలో పసిడి ధరలు.. తగ్గుతాయా ?? పెరుగుతాయా ??

కొత్త ఏడాదిలో పసిడి ధరలు.. తగ్గుతాయా ?? పెరుగుతాయా ??

Phani CH

|

Updated on: Jan 01, 2025 | 12:31 PM

భారత్‌లో పసిడి ధరలు గత కొన్ని నెలలుగా తీవ్ర హెచ్చు తగ్గులను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల గ్రాము బంగారం రూ.7,100కి అమ్ముడవుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.7,745గా ఉంది. దీపావళి తర్వాత డిమాండ్ తగ్గడం, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్ట్ ట్రంప్ విజయం, ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు తొలగడం వంటి కారణాలతో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి.

అయితే , 2025లో బంగారం ధర పెరుగుతుందా? తగ్గనుందా? అన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో.. 2025లో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం లేదని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. డబ్ల్యుజిసి చేసిన ఈ ప్రకటన వినియోగదారులకు కాస్త ఊరట కలిగిస్తోంది. 2025లో బంగారం ధర ఎలా ఉంటుందో, బంగారం ధర ఎలా తగ్గుతుందో అన్న కారణాలను నిశితంగా పరిశీలించి చూస్తే..గత నవంబర్ నెలలోనే బంగారం ధరలో తీవ్ర హెచ్చు తగ్గులు నమోదయ్యాయి. అంటే, నవంబర్ ప్రారంభంలో ఒకే వారంలో బాగా తగ్గితే.. అదే నవంబర్ నెల చివరిలో ఒకే వారంలో ఎక్కువగా పెరిగింది. నవంబర్ 5న అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు జరగ్గా.. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో బంగారం ధర ఒక్కసారిగా పడిపోయింది. డాలర్ విలువ పుంజుకోవడమే దీనికి కారణం. అయితే నవంబర్ 19 నుంచి 24 మధ్య కాలంలో బంగారం ధర పెరిగందన్న వాస్తవం.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాబా వంగా జోస్యం.. 2025లో జరగబోయే దారుణాలివేనా

TOP 9 ET News: వైలెంట్‌గా చిరు క్యారెక్టర్దిమ్మతిరిగే అప్డేట్

కారులో డ్రైవర్ కు బిగ్ షాకిచ్చిన బిచ్చగాడు

ఒకే చెట్టుకు మూడు రకాల మందార పూలు

పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే.. తెల్లజుట్టు నల్లగా..