TOP 9 ET News: వైలెంట్‌గా చిరు క్యారెక్టర్దిమ్మతిరిగే అప్డేట్

TOP 9 ET News: వైలెంట్‌గా చిరు క్యారెక్టర్దిమ్మతిరిగే అప్డేట్

Phani CH

|

Updated on: Jan 01, 2025 | 12:28 PM

గాడ్ ఫాదర్ మినహా.. ఇప్పటి వరకు చిరు కాస్త యంగ్ లుక్‌లోనే సిల్వర్ స్క్రీన్‌పై కనిపించాడు. తన స్టైల్‌ ఆఫ్ పెర్ఫార్మెన్స్‌తో.. బాక్సాఫీస్‌ ముందు కలెక్షన్స్‌ పట్టాడు. అయితే తాను చిరుతో చేయబోయే సినిమాలో మాత్రం.. మెగాస్టార్‌ను తన వయసుకు తగ్గ క్యారెక్టర్లో చూపిస్తా అంటూ అప్టేట్ ఇచ్చారు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.

అంతేకాదు ఈ సారి వయోలెంట్‌ లెవల్స్‌ కూడా పెంచి మరీ థియేటర్‌ షేకయ్యేలా చేస్తా అంటూ హింట్ ఇచ్చాడు. అయితే ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్ ఇచ్చిన ఈ అప్డేట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. తన పర అని బేధం లేకుండా.. చిన్న పెద్దా అని తేడా లేకుండా… ఎప్పుడూ అందరితో.. కలివిడిగా.. జాలీగా.. ఫన్నీగా ఉండే బాలయ్య… మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌తోనూ అలాగే ఉన్నారు. అన్‌స్టాపబుల్ షూటింగ్‌ లొకేషన్‌కు ఎంట్రీ ఇవ్వగానే చెర్రీని ప్రేమతో కౌగిలించుకున్న బాలయ్య..చాలాసేపు కబుర్లు చెప్పారు. తన డాకు మాహరాజ్ సినిమాతో పాటు.. గేమ్‌ ఛేంజర్‌ మూవీ కూడా సక్సెస్ అవ్వాలంటూ ఆకాంక్షించారు. దాంతో పాటే రామ్ చరణ్‌కు ఫన్నీగా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు బాలయ్య. యు ఆర్‌ నాట్ అలోవ్‌డ్‌ ఇన్‌టూ మై సెట్‌ అంటూ.. చెర్రీని కాసేపు ఆటపట్టించారు. దానికి చెర్రీ చేతులు జోడించి బాలయ్యకు నమస్కరించగా.. బ్రో నో అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు బాలయ్య. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. అందర్నీ ఆకట్టుకుంటోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కారులో డ్రైవర్ కు బిగ్ షాకిచ్చిన బిచ్చగాడు

ఒకే చెట్టుకు మూడు రకాల మందార పూలు

పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే.. తెల్లజుట్టు నల్లగా..

భారతదేశంలో మొట్టమొదటి విడాకుల కేసు ఇదే

టీ తాగి వెళ్లండి అని ఇంటికి పిలిచింది.. ఆశగా వెళ్ళాడు.. చివరికి