టీ తాగి వెళ్లండి అని ఇంటికి పిలిచింది.. ఆశగా వెళ్ళాడు.. చివరికి

టీ తాగి వెళ్లండి అని ఇంటికి పిలిచింది.. ఆశగా వెళ్ళాడు.. చివరికి

Phani CH

|

Updated on: Jan 01, 2025 | 12:22 PM

సిలికాన్‌ సిటీ, కోలారులో శ్వేతా గౌడ అలియాస్‌ గులాబ్‌జామూన్‌ అనే కిలాడీ హనీట్రాప్‌ దందా మరువక ముందే మరో వలపు వల వెలుగుచూసింది. 21 ఏళ్ల యువతితో కలిసి మోసగాళ్లు ఓ కాంట్రాక్టరు ను హనీ ట్రాప్‌ చేశారు. బ్యాడరహళ్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనలో నిందితులను పోలీసులు పట్టుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. దోపిడీ గ్యాంగ్‌కు చెందిన సంతోష్‌, అజయ్‌, జయరాజ్‌ అనే ముగ్గురు ఓ సివిల్‌ కాంట్రాక్టర్‌ను లక్ష్యం చేసుకున్నారు. నయన అనే యువతిని అతనికి పరిచయం చేశారు. ఆమె ఆ కాంట్రాక్టర్‌తో ప్రతిరోజూ ఫోన్లో చనువుగా మాట్లాడేది. తర్వాత ఒక రోజు టీ తాగి వెళ్లండి అని ఇంటికి పిలిచింది. దీంతో డిసెంరు 9వ తేదీన కాంట్రాక్టరు ఆమె ఇంటికి వెళ్లాడు. కొంతసేపటికే నిందితులు పోలీసుల దుస్తుల్లో వచ్చారు. ఇక్కడ వ్యభిచారం చేస్తున్నారా? మిమ్మల్ని అరెస్ట్‌ చేస్తామంటూ బెదిరించారు. అతనిని కొట్టి ఫోటోలు తీసుకున్నారు. మేడంతో సెటిల్‌మెంట్‌ చేసుకో లేదంటే జైల్లో ఊచలు లెక్కపెడతావ్‌ ..అని బెదిరించారు. అతని జేబులో ఉన్న రూ.29 వేల నగదు, ఫోన్‌పే నుంచి మరో రూ.26 వేలు, ఒంటిపై ఉన్న సుమారు రూ.5 లక్షల విలువ చేసే బంగారాన్ని లాక్కుని వెళ్లిపోయారు. వారు వెళ్లిపోయాక ఇద్దరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేద్దామని యువతిని రమ్మన్నాడు. అందుకు యువతి నిరాకరించింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నాని HIT3 సెట్‌లో విషాదం.. ఉన్నట్టుండి షూటింగ్‌లో ఆమె మృతి

అల్లు అర్జున్‌కు యాటిట్యూడ్, బలుపు ఉంటే తప్పేంటబ్బా ??