పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే.. తెల్లజుట్టు నల్లగా..

పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే.. తెల్లజుట్టు నల్లగా..

Phani CH

|

Updated on: Jan 01, 2025 | 12:24 PM

జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉండాలంటే ప్రత్యేక కేర్‌ తీసుకోవడం చాలా అవసరం. అందుకోసం కొన్ని రెమిడీస్‌ అద్భుతంగా పనిచేస్తాయంటున్నారు నిపుణులు. వాటిలో ఒకటి పెరుగు. పెరుగు మీ జుట్టుకు పూర్తి పోషణను అందిస్తుంది. పెరుగులో ఉసిరి పొడిని కలిపి జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది. ఉసిరి పొడి పెరుగు హెయిర్ ప్యాక్ జుట్టు రాలడం సమస్యను తగ్గిస్తుంది.

ఉసిరిపొడిని పెరుగుతో కలిపి హెయిర్ ప్యాక్‌లా వాడితే, క్రమంగా మీ జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. దీని వల్ల డాండ్రఫ్ దూరమై జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది. ఈ హెయిర్‌ ప్యాక్‌ కోసం 2 స్పూన్ల ఉసిరి పొడిని తీసుకుని, దానికి 3 స్పూన్ల పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి ఒక గంట తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే కొద్ది రోజుల్లోనే తేడా కనిపిస్తుంది. చుండ్రు సమస్య తగ్గుతుంది. ఉసిరి, పెరుగును హెయిర్‌ ప్యాక్‌ తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి కూడా సహాయపడుతుంది. జుట్టు మూలం గట్టిపడి, హెయిర్‌ఫాల్‌ తగ్గుతుంది. పెరుగు, ఉసిరి మిశ్రమం జుట్టు ఎదిగేందుకు తోడ్పడుతుంది. పెరుగు చిట్లిపోయి, పాడైపోయిన వెంట్రుకలను రిపైర్ చేసి, తిరిగి యథాస్థితికి తీసుకొస్తుంది. ఉసిరిలో విటమిన్స్, ఖనిజాలు, అమైనో యాసిడ్స్, ఫైటో న్యూట్రియెంట్స్ ఉన్నాయి. ఇవి తలలో రక్త ప్రసరణ సజావుగా సాగేలా చేస్తుంది. దీంతో జుట్టు ఆరోగ్యంగా, నల్లగా మారి బలంగా పెరుగుతుంది. ఈ సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారతదేశంలో మొట్టమొదటి విడాకుల కేసు ఇదే

టీ తాగి వెళ్లండి అని ఇంటికి పిలిచింది.. ఆశగా వెళ్ళాడు.. చివరికి

నాని HIT3 సెట్‌లో విషాదం.. ఉన్నట్టుండి షూటింగ్‌లో ఆమె మృతి

అల్లు అర్జున్‌కు యాటిట్యూడ్, బలుపు ఉంటే తప్పేంటబ్బా ??