Pushpa 2: న్యూ ఇయర్ గిఫ్ట్.. పుష్ప-2 లో మరికొన్ని సీన్లు యాడ్ చేస్తున్నారా.?

Pushpa 2: న్యూ ఇయర్ గిఫ్ట్.. పుష్ప-2 లో మరికొన్ని సీన్లు యాడ్ చేస్తున్నారా.?

Anil kumar poka

|

Updated on: Dec 30, 2024 | 12:31 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మూడు వారాలు గడిచినా హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధిస్తోంది. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ సినిమాలో మరికొన్ని సీన్లు జత చేయనున్నారని తెలుస్తోంది.

అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో భారీ విజయాన్ని అందుకోవడంతో ఫ్యాన్స్ కు స్పెషల్ సర్ ప్రైజ్ ఇవ్వనుంది పుష్ప టీం. డిసెంబర్ 05న విడుదలైన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.1,730 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ఇందులో బాలీవుడ్‌లోనే సుమారుగా రూ. 800 కోట్లకు పైగా రాబట్టి పాత రికార్డులన్నీ కొల్లగొట్టింది. అయితే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో పుష్ప 2 టీమ్ సెలబ్షన్స్ కు దూరంగా ఉంది. అల్లు అర్జున్ కూడా ఎలాంటి సక్సెస్‌ టూర్స్‌ ప్లాన్‌ చేయలేదు. అయితే సినిమా లవర్స్ కు ఉత్సాహానిచ్చేలా పుష్ప 2 సినిమాలో మరిన్ని సీన్లు జత చేయనున్నారని తెలుస్తోంది. న్యూ ఇయర్ కానుకగా జనవరి 1 నుంచి థియేటర్లలో కొత్త సీన్లతో పుష్ప 2 సినిమాను ప్రదర్శిస్తారని టాలీవుడ్ టాక్. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కూడా ఈ సన్నివేశాలకు సంబంధించి డబ్బింగ్ చెబుతున్రడని తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోలో డబ్బింగ పనులు జరుగుతున్నాయని సమాచారం. పుష్ప 2 సినిమా రన్‌టైమ్‌ సుమారు 3 గంటల 15 నిమిషాలు ఉండటం వల్ల కథలో చాలా ముఖ్యమైన సీన్లను ఎడిటింగ్‌లో తొలగించారట. ఇప్పుడు వీటిని తిరిగి జత చేయనున్నారట. సుమారు 20 నిమిషాల సీన్లు కలిపే అవకాశం ఉంది. ప్రధానంగా ఓటీటీ వెర్షన్‌ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా, డిజిటల్ స్ట్రీమింగ్ కు ఇంకా సమయం ఉండడంతో థియేట్రికల్ వెర్షన్ లోనే వీటిని జతచేయనున్నారని సమాచారం.

పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. మలయాళ సూపర్ స్టార్ ఫహద్ ఫాజల్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించారు. అలాగే జగపతిబాబు, సునీల్, అనసూయ, రావు రమేష్.. వీళ్లంతా కీ రోల్స్ పోషించారు. ఇక డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. ఇప్పటికే దేశవిదేశాల్లో రికార్డులు కొల్లగొట్టింది. కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో పుష్పాకు నార్త్ తో పాటు ఫారిన్ లోనూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పాటైంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.