అక్కినేనిపై మోదీ ప్రశంసల వర్షం !!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది చివరి ‘మన్ కీ బాత్ కార్యక్రమం తాజాగా ఎయిర్ అయింది. అయితే ఈ కార్యక్రమంలో ఈసారి తెలుగు చలనచిత్ర దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుపై ప్రశంసల జల్లులు కురిపించడం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌తో పాటు.. త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అవుతోంది. ఇక మన్‌కీ బాత్ కార్యక్రమంలో ఎప్పటిలాగే ఎన్నో విషయాలు మాట్లాడిన పీఎం.. దాంతో పాటే తెలుగు సినిమాకు అక్కినేని చేసిన కృషిని కొనియాడారు.
తన సినిమాలలో భారతీయ సంప్రదాయాలు, విలువలకు తగిన స్థానం కల్పించి టాలీవుడ్ ను మరో స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు. మానవతా విలువలను కూడా ఆయన చాటారని అన్నారు. టాలీవుడ్‌కు ANR ఎంతో సేవ చేశారని.. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తు ఉంటాయని తెలిపారు. భారతీయ చలనచిత్ర రంగం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని చెప్పారు. రాజ్ కపూర్, మహ్మద్ రఫీ, అక్కినేని నాగేశ్వరరావు, తపన్ సిన్హాల సేవలను మోదీ స్మరించుకున్నారు. భారత్ నుంచి అద్భుతమైన సినిమాలు వస్తున్నాయని, ప్రపంచవ్యాప్తంగా మన సినిమాలు రికార్డులను సృష్టించడంతో పాటు అవార్డులు దక్కించుకుంటున్నాయన్నారు మోదీ. వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌ను తొలిసారిగా మన దేశంలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో మీడియా, వినోద పరిశ్రమకు చెందిన ప్రపంచ దేశాల దిగ్గజాలు పాల్గొంటారని మోదీ తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గోటితో పోయేదానికి గొడ్డలి దాకానా.. చురకలంటించిన పవన్ కళ్యాణ్
అన్ స్టాపబుల్ షోకు గ్లోబల్ స్టార్.. బాలయ్య, చరణ్ కాంబో అదుర్స్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

