OG అంటూ ఫ్యాన్స్ అరుపులు.. చిరాకుతో అరిచిన పవన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్.. తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరోవైపు ఇప్పటికే ఒప్పుకొన్న సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. పవన్‌కళ్యాణ్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న గ్యాంగ్‌స్టర్ మూవీ OG. ఇటీవల పవన్ ఎక్కడకు వెళ్లినా, ఓజీ.. ఓజీ.. అంటూ అభిమానులు నినాదాలు చేస్తున్నారు. అభిమానులు అలా అనగానే నవ్వుకునే పవన్.. కడపలో మాత్రం అసహనం వ్యక్తం చేశారు.
ఏంటయ్యా మీరు.. ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో కూడా తెలియదు.. పక్కకు జరగండి.. అంటూ చిరాకుపడ్డారు. ఇక ఓజీ అంటూ అరిచిన ఫ్యాన్స్‌పై కడపలో చిరాకు పడిన పవన్… మంగళగిరిలో చిట్‌చాట్‌లో మాత్రం కాస్త కూల్‌గా మాట్లాడారు. ఫ్యాన్సందరూ ఓజీ ఓజీ అని అరుస్తుంటే తనకు బెదిరింపులా అనిపిస్తుందని చెబుతూనే.. తన అప్ కమింగ్ సినిమా అప్డేట్స్ ఇచ్చారు పవన్. మేకర్స్ అందరికీ తాను సరిపడా డేట్స్ ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదని చెప్పిన పవన్.. హరిహరి వీరమల్లుకు ఇంకో 8 రోజులు షూటింగ్ పెండింగ్ ఉందంటూ తన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. అంతేకాదు త్వరలోనే హరిహర, ఓజీ రెండు సినిమాలను పూర్తి చేస్తా అంటూ మరోసారి క్లారిటీ ఇచ్చారు పవన్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పోలీసులకు సంధ్యా థియేటర్ నుంచి ఘాటు రిప్లయ్
వారసత్వం కాదు.. పనితనం !! అన్నకు మంత్రి పదవిపై పవన్ కామెంట్స్
చరణ్ సినిమా ఈవెంట్‌కు పవన్ ?? దిల్ రాజు పర్సనల్ రిక్వెస్ట్
అక్కినేనిపై మోదీ ప్రశంసల వర్షం !!
గోటితో పోయేదానికి గొడ్డలి దాకానా.. చురకలంటించిన పవన్ కళ్యాణ్