రామ్ చరణ్ కెరీర్ కు ఇది గేమ్ ఛేంజర్ అవుతుందా ??
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది.
తెలుగమ్మాయి అంజలి మరో కీలక పాత్ర పోషించింది. దిల్ రాజు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడలో రామ్ చరణ్ భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు అభిమానులు. గేమ్ ఛేంజర్ సినిమా భారీ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో ఈ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. విజయవాడ బృందావన కాలనీలో ఉన్న వజ్రా మైదానంలో డిసెంబర్ 29 మధ్యాహ్నం 3 గంటలకు చిత్ర యూనిట్ ఈ బిగ్గెస్ట్ కటౌట్ ను ఆవిష్కరించింది. వేడుకల్లో భాగంగా హెలికాప్టర్‌తో రామ్ చరణ్ కటౌట్‌కి పూలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజుతో పాటు గేమ్ ఛేంజర్ చిత్ర బృందం హాజరైంది. అలాగే రామ్ చరణ్ అభిమానులు భారీగా వచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
OG అంటూ ఫ్యాన్స్ అరుపులు.. చిరాకుతో అరిచిన పవన్
పోలీసులకు సంధ్యా థియేటర్ నుంచి ఘాటు రిప్లయ్
వారసత్వం కాదు.. పనితనం !! అన్నకు మంత్రి పదవిపై పవన్ కామెంట్స్