TOP 9 ET News: పవన్ 23 ఏళ్ల రికార్డ్‌ను బద్దలు కొట్టిన బన్నీ
పవన్ 23 ఏళ్ల రికార్డ్ ఎట్టకేలకు బద్దలైంది. పుష్ప2 సినిమాతో బన్నీ ఈ రికార్డ్‌ను బద్దలుకొట్టడం హిస్టరీకెక్కింది. సంధ్య థియేటర్‌లో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా పవన్ కల్యాణ్ నటించిన 'ఖుషి' ఉంది. 2001లో విడుదలైన ఈ మూవీ సంధ్య థియేటర్‌లో 1 కోటి 56 లక్షల రూపాయలను రాబట్టి అప్పట్లో రికార్డ్ క్రియేట్ చేసింది.
అయితే ఇదే రికార్డ్‌ను.. దాదాపు 23 ఏళ్ల తర్వాత పుష్ప2 బ్రేక్ చేసింది. డిసెంబర్ 5న రిలీజ్ అయిన అల్లు అర్జున్ పుష్ప2 మూవీ.. 24 రోజులకు గాను 1 కోటి 59 లక్షలను వసూలు చేసింది. మొత్తానికి ఖుషీ సినిమా ఆల్ టైం కలెక్షన్స్‌ను దాటేసింది. ఎట్టకేలకు అల్లు అర్జున్ ఇష్యూపై ఏపీ డిప్యూటీ సీంఎ పవన్ రియాక్టయ్యారు. తనదైన స్టైల్లో దీనిపై మాట్లాడారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారంటూ బన్నీ ఇష్యూను సింగిల్ లైన్‌లో తేల్చేశారు. అభిమాని మృతిచెందిన తర్వాత.. వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాలని.. అయితే ఈ విషయంలో మానవతా దృక్పథం లోపించినట్టైందని పవన్ క్లియర్ గా చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రామ్ చరణ్ కెరీర్ కు ఇది గేమ్ ఛేంజర్ అవుతుందా ??
OG అంటూ ఫ్యాన్స్ అరుపులు.. చిరాకుతో అరిచిన పవన్
పోలీసులకు సంధ్యా థియేటర్ నుంచి ఘాటు రిప్లయ్
వారసత్వం కాదు.. పనితనం !! అన్నకు మంత్రి పదవిపై పవన్ కామెంట్స్