వావ్.. పులులు ఇలా కూడా ప్రవర్తిస్తాయా ?? ఆశ్చర్యపోతూ కామెంట్లు చేస్తున్న నెటిజన్లు
వన్య ప్రాణుల నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. క్రూర మృగాలు ఎప్పుడు, ఎలా ప్రవర్తిస్తాయో ఎవ్వరూ అంచనా వేయలేరు. అయితే ఇటీవలి కాలంలో పులులు, సింహాలు వంటి క్రూర మృగాలను కూడా చాలా మంది పెంచుకుంటున్నారు. దుబాయ్, పాకిస్తాన్ వంటి దేశాల్లో ఈ ట్రెండ్ బాగా పెరుగుతోంది. ఆ క్రూర మృగాలు కూడా మనుషులకు బాగానే చేరువ అవుతున్నాయి.
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. AMAZlNGNATURE అనే ట్విటర్ హ్యాండిల్‌లో వీడియో షేర్ అయింది. ఓ చిరుత పులి బోనులో పడుకుని ఉంది. ఓ వ్యక్తి ఆ బోనులోకి చేయి పెట్టి చిరుత పులి తలను నిమురుతున్నాడు. అతడు అలా నిమురుతుండడాన్ని ఆ పులి బాగా ఎంజాయ్ చేస్తోంది. తన కాలిని అతడి చేతిపై వేసి మరీ ఎక్కడ నిమరాలో చెబుతోంది. ఆ చిరుతను అప్పుడే ఓ ప్రమాదం నుంచి రక్షించి ఆ బోనులో పెట్టి సంరక్షిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రమాదం నుంచి కాపాడిన మనుషులతో ఆ చిరుత ప్రేమగా మెలుగుతోంది. ఆ దృశ్యాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Follow Us
వైరల్ వీడియోలు
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

