ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్‌లో ‘ఒకే ఒక్కడు’ ఎన్ని రూ.లక్షల ఆర్డర్ చేశాడంటే..
ప్రస్తుతం ఇంటి నుంచి షాపింగ్ చేయడానికి, రెస్టారెంట్ పుడ్ ను ఇంటికే తెప్పించుకుని తినడానికి ఎక్కువ మంది ఆసక్తిని చూపిస్తున్నారు. బయట తినే బదులు ఇంటి నుంచి ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. ఇలా చేయడం వలన ట్రాఫిక్ జామ్ వంటి ఇబ్బందులు లేకుండా ఇంట్లోనే కూర్చుని నచ్చిన , మెచ్చిన రుచికరమైన ఆహారాన్ని తింటున్నారు.
జొమాటో, స్విగ్గీ వంటి కంపెనీలు ప్రస్తుతం బాగా పాపులర్ అవ్వడానికి ఇదే కారణం. ఒక వ్యక్తి ఒక సంవత్సరంలో లక్షల రూపాయల విలువైన ఆహారాన్ని ఆర్డర్ చేశాడనే వార్తతో ఆన్ లైన్ లో ఆహారాన్ని ఎలా ఆర్ధర్ చేస్తున్నారో అంచనా వేయవచ్చు. ప్రతి సంవత్సరం చివరిలో.. కంపెనీలు తమ ఏడాది డేటాను పంచుకుంటాయి. ఏ సినిమాలు చూశారు. ఏ చిత్రం సంచలనం సృష్టించింది? ఎవరు ఎంత తిన్నారు, ఏ సంస్థకు ఎంత ఆర్డర్ చేశారు? వంటి విషయాలను షేర్ చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఆన్ లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ అందించే జొమాటో కూడా తన వార్షిక నివేదికను విడుదల చేసింది. బెంగళూరుకు చెందిన ఓ ఆహార ప్రియుడు 2024లో రూ.5 లక్షల విలువైన ఆహారం తిన్నాడని వెల్లడించింది. అనమ్ అనే వ్యక్తి ఆహార ప్రియుడు. జొమాటో నివేదిక ప్రకారం అతను 2024 ఏడాది మొత్తంలో రూ. 5,13,733ల విలువైన ఆహారాన్ని ఆర్డర్ చేశాడు. ఫుడ్ ఆర్డర్‌కు సంబంధించిన విషయాలతో పాటు ప్రజలు తిన్న డేటాను కూడా జొమాటో పంచుకుంది. 2024లో జొమాటో ద్వారా 1 కోటి కంటే ఎక్కువ టేబుల్స్ రిజర్వ్ చేసుకున్నారని వెల్లడించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్మశానంలో అస్తికల చోరీ.. ఎందుకంటే..
ట్రైన్ చక్రాల కింద వేలాడుతూ 250 కి.మీ. జర్నీ
వావ్.. పులులు ఇలా కూడా ప్రవర్తిస్తాయా ?? ఆశ్చర్యపోతూ కామెంట్లు చేస్తున్న నెటిజన్లు