Bullet Train: అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
చైనా తమ నూతన ఆవిష్కరణలను ప్రపంచానికి చూపిస్తోంది. తాజాగా గంటకు 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల బుల్లెట్ రైలును ప్రపంచానికి పరిచయం చేసింది. దీనిని సీఆర్450గా వ్యవహరిస్తోంది. ఆదివారం బీజింగ్‌లో పరీక్షించారు. గంటకు 400 కిలోమీటర్ల వేగాన్ని అందుకొంది. ఈ రైల్ డిజైన్ చాలా నాజుగ్గా, బుల్లెట్ షేప్ ముక్కుతో ఉంటుందని చైనా రైల్వే తెలిపింది.
చైనా బుల్లెట్ రైలు అత్యధికంగా గంటకు 450 కిమీ వేగాన్ని అందుకోగలదని పేర్కొంది. ఇది వినియోగంలోకి వచ్చే నాటికి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వాణిజ్య రైలుగా నిలుస్తుందని చెప్పింది. ఈ ట్రైన్ బీజింగ్ నుంచి షాంఘైకి కేవలం 2.5 గంటల్లోనే ప్రయాణించగలదు. గతంలో ఈ ప్రయాణానికి నాలుగు గంటల సమయం పట్టేది. ప్రస్తుతం చైనాలోని హైస్పీడ్ రైలు వ్యవస్థ అతిపెద్దది. మొత్తం 45,000 కిలోమీటర్ల మేరకు విస్తరించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే చైనా ప్రభుత్వరంగ రైల్వే సంస్థ సీఆర్450 ప్రొటోటైప్‌ను డిసెంబర్‌లో పరీక్షిస్తామని చెప్పింది. చైనా 14వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. దీని కింద హైస్పీడ్ రైళ్లు, వంతెనలు, ట్రాక్‌లు, సొరంగాలు నిర్మించనున్నారు.
ఈ రైలు బాడీ బరువు కేవలం 10 టన్నులు మాత్రమే. ప్రస్తుతం సీఆర్400 మోడల్ కంటే ఇది 12 శాతం తక్కువ. విద్యుత్తును కూడా 20 శాతం తక్కువగానే వినియోగించుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక గత మోడల్ కంటే అదనంగా 50 కిలోమీటర్లు అధిక వేగంతో ప్రయాణించగలదు. ఇంజిన్ పరీక్షల్లో ఇది అత్యధికంగా గంటకు 453 కిమీ వేగాన్ని అందుకుంది. అలాగే చైనా తాజాగా ఆరో తరానికి చెందినదిగా చెబుతున్న జె-36 యుద్ధ విమానాన్ని ఆవిష్కరించింది. సిచువాన్ ప్రావిన్స్‌లోని చెంగ్డూలో దీనిని అభివృద్ధి చేసినట్లు భావిస్తున్నారు. మూడు ఇంజిన్లతో ఇది అమెరికాకు చెందిన ఎఫ్-35, ఎఫ్-22 రాప్టర్లను సవాలు చేయగలదని చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.