Black Moon: ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే.. కష్టమే.!

Black Moon: ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే.. కష్టమే.!

Anil kumar poka

|

Updated on: Jan 02, 2025 | 5:13 PM

కొన్ని గంటల్లో 2024 సంవత్సరం ముగుస్తుంది. వెళ్తూ వెళ్తూ 2024వ సంవత్సరం ప్రజలకు ఓ అద్భుతమైన అనుభూతిని మిగిల్చి వెళ్లబోతోంది. డిసెంబర్ 30వ తేదీ రాత్రి ఆకాశంలో అరుదైన దృశ్యం కనిపించనుంది. అవును, అంతరిక్ష ప్రపంచంలో అపూర్వమైన ఖగోళ ఘట్టం చోటుచేసుకోనుంది. ప్రతీ సంవత్సరం ప్రజలు నీలి చంద్రుడు, పౌర్ణమి, సూపర్ మూన్, సూర్యగ్రహణం, ఉల్కలు, రంగురంగుల వెలుతురు, గ్రహాలు మొదలైన వాటిని చూశారు.

ఈ నెలలో ఇది రెండో అమావాస్య అవుతుంది. ఎందుకంటే అంతకుముందు డిసెంబర్ 15 న ప్రపంచం చల్లని చంద్రుడిని చూసింది. ఇప్పుడు నల్లని చంద్రుడు ఉదయించినప్పుడు, ఆకాశం పూర్తి నల్లగా మారుతుంది. నక్షత్రాలు, గ్రహాలను చూడటానికి ఈ రాత్రి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. తక్కువ కాంతి కారణంగా, నక్షత్రరాశులు.. గ్రహాల వీక్షణ ఖగోళ శాస్త్ర ప్రియులకు మరింత అద్భుతంగా కనిపిస్తాయి. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్ర ప్రియులను ఆశ్చర్యపరిచేదిగా మారింది. బ్లాక్ మూన్ అంటే ఏమిటి? బ్లాక్ మూన్ అంటే చంద్రుని రంగు నల్లగా మారుతుందని కాదు, ఒక నెలలో రెండవ అమావాస్య సంభవించినప్పుడు.. బ్లాక్ మూన్ అనేది ఏర్పడుతుంది. ఇది పౌర్ణమితో వచ్చే బ్లూ మూన్ ఈవెంట్‌ను పోలి ఉంటుంది. అయితే చంద్రుడు భూమి నుంచి చూస్తే కనిపించడు. సూర్యునికి ఎదురుగా ఉండటం వలన, దానిపై కాంతి పడదు. కాబట్టి, ఇలా జరుగుతుంది. బ్లాక్ మూన్ అనేది.. ఖగోళ శాస్త్రంలో అధికారిక పదం కానప్పటికీ, ఖగోళ శాస్త్ర ప్రేమికులు దీనిని ప్రత్యేకంగా భావిస్తారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.